One Rupee Function Hall: ఒక్క రూపాయికే ఏసీ ఫంక్షన్ హాల్.. పేదలకు కార్పొరేట్ కానుక.. ప్రారంభించిన మంత్రి నారాయణ
సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న నూతన ఫంక్షన్ హాల్‌ను కేవలం ఒక్క రూపాయి (One Rupee Function Hall)సంకేతిక అద్దెకే ప్రజలకు అందించాలని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది.
- V Santhosh Kumar
- Published on- August 25, 2026 / 03:29 PM IST
Nellore municipal corporation offers corporate ac function hall for one rupee
- రూపాయికే కార్పొరేట్ ఫంక్షన్ హాల్
- నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కానుక
- 5 వేల మంది సామర్థ్యం
One Rupee Function Hall; నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ ఇంట్లోని శుభకార్యాలను ఎంతో వైభవంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించుకోవడానికి ఒక సువర్ణావకాశం అందుబాటులోకి వచ్చింది. సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న నూతన ఫంక్షన్ హాల్‌ను కేవలం ఒక్క రూపాయి (One Rupee Function Hall)సంకేతిక అద్దెకే ప్రజలకు అందించాలని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ అద్భుతమైన ఫంక్షన్ హాల్‌ను ఇటీవల రాష్ట్ర మంత్రి నారాయణ ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
రూ.1.40 కోట్లతో కార్పొరేట్ వసతులు:
ఎన్‌క్యాప్ (NCAP) నిధులు రూ.25 లక్షలు, నెల్లూరు నగరపాలక సంస్థ నిధులు రూ.1.15 కోట్లతో మొత్తం రూ.1.40 కోట్ల అంచనా వ్యయంతో ఈ హాల్‌ను అత్యంత ఆధునికంగా నిర్మించారు. ఈ ఫంక్షన్ హాల్ పూర్తిగా సెంట్రల్ ఏసీ సౌకర్యంతో పాటు ఆకర్షణీయమైన టైల్స్, కార్పొరేట్ తరహా ఇంటీరియర్‌తో డిజైన్ చేయబడింది. శుభకార్యాలకు వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విశాలమైన పార్కింగ్ సదుపాయాన్ని కూడా కల్పించారు.
5 వేల మంది సామర్థ్యంతో సేవలు:
ఒకే సమయంలో సుమారు 5,000 మంది అతిథులు పాల్గొనే సామర్థ్యం ఈ ఫంక్షన్ హాల్ సొంతం. సాధారణంగా ప్రైవేట్ హాల్స్ కోసం వేలల్లో, లక్షల్లో ఖర్చు చేయలేని పేద వర్గాలకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తోంది. నగరపాలక సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
