Vizianagaram : హీరోయిన్‌ను చేసేందుకు కూతురికి హార్మోన్ ఇంజెక్షన్ల కేసులో ట్విస్ట్.. తల్లి సంచలన ఆరోపణలు

Vizianagaram : సాయం చేస్తున్నట్టు నటించి మమ్మల్ని వాడుకోవాలని చూశారని ఆమె ఆరోపణలు చేశారు.

  • Published On : June 12, 2023 / 12:22 AM IST

Vizianagaram Hormone Injections Case (Photo : Google)

Vizianagaram Hormone Injections Case : హీరోయిన్ ను చేసేందుకు కూతురికి బలవంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చిన తల్లి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మీడియా ముందుకు వచ్చిన కూతురి తల్లి ఆనందకుమారి సంచలన ఆరోపణలు చేసింది. అభిషేక్, దేవరాజ్ అనే ఇద్దరు పాస్టర్లు తన కూతురితో తనపై తప్పుడు కేసు పెట్టించారని ఆమె చెప్పారు.

తన కుమార్తెను లొంగదీసుకోవాలని ఆ పాస్టర్లు ప్రయత్నించారని ఆనందకుమారి తెలిపారు. ఒక ల్యాండ్ సెటిల్ మెంట్ విషయంలో జరుగుతున్న గొడవల నేపధ్యంలోనే వారు తన కూతురిని ట్రాప్ చేశారని అన్నారు. వాళ్లు సాయం చేస్తున్నట్టు నటించి మమ్మల్ని వాడుకోవాలని చూశారని ఆమె ఆరోపణలు చేశారు. అందుకు ఒప్పుకోనందుకు తన కూతురుని హిప్నటైజ్ చేసి పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేసేలా చేశారని వాపోయారు.

Also Read..Apsara Case : పూజలు చేసే చేతితోనే చంపి పాతరేశాడు.. పక్కా ప్లాన్‌తోనే మర్డర్, అప్సర కేసులో సంచలన నిజాలు

”వాళ్లు నా కూతురిని పిచ్చిదాన్ని చేశారు. మళ్లీ వాళ్లే బాగు చేస్తున్నట్టుగా నటించి, శారీరకంగా హింసించారు. ఈ విషయం గ్రహించి వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశా. ఫిర్యాదు చేశానన్న అక్కసుతో నా కూతురుని ట్రాప్ చేసి, నాకు వ్యతిరేకంగా చైల్డ్ లైన్ అధికారులకు ఫిర్యాదు చేయించారు. నా కుమార్తెకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చాననడం, వేధింపులకు గురి చేశానని చెప్పడం.. అన్నీ కేవలం కల్పితాలు” అని ఆనందకుమారి స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే..
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో నివాసం ఉండే ఓ మహిళ తన కూతురిని హీరోయిన్ చేయాలనుకుంది. అయితే కూతురికి ఇంకా 15ఏళ్లే. సరైన వయసు రాలేదు. దాంతో ఆమె దిగజారిపోయింది. వయసు లేకపోయినా త్వరగా పెద్దదాన్ని చేసేందుకు, కూతురి శరీర భాగాలు పెరిగేందుకు బలవంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చింది.

Also Read..Apsara Case : అప్సర హత్య కేసులో వెలుగులోకి మరో కొత్తకోణం.. అప్సర పెళ్లిఫొటోలు వైరల్

ఈ మేరకు కూతురే తన తల్లిపై ఆరోపణలు చేసింది. తన తల్లి తనను టార్చర్ పెడుతోందని చైల్డ్ లైన్ అధికారులకు ఫిర్యాదు చేసింది. చైల్డ్ లైన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను కాపాడారు. బాలికను విశాఖలోని స్వధార్ హోమ్ కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కసాయి తల్లిని అరెస్ట్ చేశారు. అయితే, తాజాగా.. తన కూతురికి తాను ఎలాంటి ఇంజెక్షన్లు ఇవ్వలేదని, దీనికి వెనుక ఇద్దరు పాస్టర్లు కుట్ర ఉందని బాలిక తల్లి చెప్పడం సంచలనంగా మారింది.

Also Read..Vizianagaram : కూతురిని హీరోయిన్ చేయాలని, ఆ భాగాలు త్వరగా పెరగాలని హార్మోన్ ఇంజెక్షన్లు.. కసాయి తల్లి అరెస్ట్