Apsara Case : పూజలు చేసే చేతితోనే చంపి పాతరేశాడు.. పక్కా ప్లాన్‌తోనే మర్డర్, అప్సర కేసులో సంచలన నిజాలు

Apsara Case : కోయంబత్తూరు వెళ్దామని ఈ నెల 3న అప్సరను పూజారి సాయికృష్ణ కారులో ఎక్కించుకున్నాడు. ముందు సీట్లో నిద్రపోతున్న ఆమె ముఖంపై కారు కవర్ షీట్ తో నొక్కాడు.

Apsara Case : పూజలు చేసే చేతితోనే చంపి పాతరేశాడు.. పక్కా ప్లాన్‌తోనే మర్డర్, అప్సర కేసులో సంచలన నిజాలు

Apsara Case

Apsara Case – Priest Sai Krishna : వివాహేతర సంబంధాలు చాలా ప్రమాదకరం. ఈ తరహా రిలేషన్స్ కారణంగా చాలా ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. మరెందరో హంతకులుగా మారి జైలుపాలు అవుతున్నారు. అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు మంచివి కాదని, ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని, హంతకులుగా మారాల్సి వస్తుందని, అటువంటి రిలేషన్స్ కు దూరంగా ఉండండని పోలీసులు నెత్తి నోరు బాదుకుని చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా, ఇంత చెబుతున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. వివాహేతర సంబంధాలు పెట్టుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.

తాజాగా హైదరాబాద్ లో జరిగిన దారుణం తీవ్ర సంచలనం రేపింది. వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీసింది. ఓ పూజారిని హంతకుడిని చేసింది. పూజలు చేసిన చేతితోనే ఆ పూజారి ఓ మహిళను చంపి పాతరేశాడు. ఆమెను హత్య చేసి శవాన్ని మ్యాన్ హోల్ లో దాచిన పూజారి వ్యవహారం కలకలం మారింది. అప్సర కేసులో షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయి. పక్కా ప్లాన్ తోనే పూజారి సాయికృష్ణ.. అప్సరను మర్డర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సంచలనం రేపిన అప్సర హత్య కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు తెలిపారు.

Also Read..Hyderabad : డబ్బు అడిగిన యువతికి కోరిక తీర్చాలని వేధింపులు, ఆ తర్వాత వీడియోలు చూపి.. హైదరాబాద్‌లో దారుణం

అప్సర హత్యకు అదే కారణం- డీసీపీ
”అప్సర మర్డర్ కు వివాహేతర సంబంధమే కారణం. కోయంబత్తూరు వెళ్దామని ఈ నెల 3న అప్సరను పూజారి సాయికృష్ణ కారులో ఎక్కించుకున్నాడు. ముందు సీట్లో నిద్రపోతున్న ఆమె ముఖంపై కారు కవర్ షీట్ తో నొక్కాడు. ప్రతిఘటించడంతో అప్పటికే తెచ్చుకున్న రాయితో తలపై కొట్టి చంపాడు. తర్వాత డెడ్ బాడీని మ్యాన్ హోల్ లో దాచాడు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లు అప్సర కనిపించడం లేదని పోలీసులకు పూజారి సాయికృష్ణ ఫిర్యాదు చేశాడు” అని శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.

Rajasthan : చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి తీసుకెళ్లి పిల్లలపై హెడ్‌మాస్టర్ అఘాయిత్యం, ఆ వీడియోలకు బానిసగా మారి ఇలా..

” ఈ నెల 3న అప్సరను కారు ఎక్కించుకుని శంషాబాద్ కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సుల్తాన్ పూర్ లోని ఓ ఫామ్ హౌస్ కి తీసుకెళ్లాడు. అక్కడే అప్సరను బెల్లం కొట్టే రాయితో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత అదే కారులో మళ్లీ సరూర్ నగర్ తీసుకొచ్చి మృతదేహాన్ని మ్యాన్ హోల్ లో దాచాడు. దాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు మ్యాన్ హోల్ పై మట్టిపోశాడు. అప్సరను హత్య చేసిన రెండు రోజుల తర్వాత జూన్ 5న.. అప్సర కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పూజారి సాయికృష్ణ.

హత్యను మిస్సింగ్ కేసుగా చిత్రీకరించేందుకు పూజారి ప్రయత్నించాడు. అప్సర, సాయికృష్ణ మధ్య ప్రేమ, వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణం. అప్సరను వదిలించుకోవాలనే పక్కా ప్లాన్ ప్రకారం ఈ మర్డర్ చేశాడు. ఏడాదిగా అప్సరతో సాయికి రిలేషన్ ఉంది. సాయికృష్ణకు పెళ్లైందని తెలిసినా తనను పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి చేసింది. ఇద్దరికీ ఎలాంటి బంధుత్వం లేదు. ఒకటే కమ్యూనిటీ. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఆధారాలు సేకరించాం. హత్య తర్వాత పోలీసులను తప్పుదారి పట్టించేలా యువతి కనిపించడం లేదంటూ పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు పూజారి. పోలీసుల విచారణలో సాయికృష్ణే హత్య చేసినట్లు తేలింది. మార్చిలో తనను పెళ్లి చేసుకోవాలని అప్సర కోరింది. దాంతో అతడు ఆమెను చంపేశాడు” అని డీసీపీ వెల్లడించారు.

అప్సర డెడ్ బాడీకి రేపు (జూన్ 10) పోస్టుమార్టం నిర్వహించనున్నారు పోలీసులు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. సరూర్ నగర్ కు చెందిన సాయికృష్ణ ఓ ఆలయంలో పూజారి. అదే గుడికి అప్సర వచ్చేది. దాంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలంటూ సాయికృష్ణపై అప్సర ఒత్తిడి తెచ్చింది. అయితే అప్పటికే తనకు పెళ్లై ఒక పాప కూడా ఉందని పూజారి చెప్పినా అప్సర ఊరుకోలేదు. తనను పెళ్లి చేసుకోవాల్సిందేనని ఒత్తిడి పెంచింది. దాంతో, ఎలాగైనా అప్సరను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న నిందితుడు.. పక్కా ప్లాన్ తో ఆమెను శంషాబాద్ తీసుకెళ్లి హత్య చేశాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా డెడ్ బాడీని మ్యాన్ హోల్ లో దాచాడు. కానీ, పోలీసుల విచారణలో పూజారి బండారం బట్టబయలైంది.