Love Cheating: కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమించాడు. పెద్ద వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకుందామని నమ్మించాడు. సడన్‌గా మాట మార్చి వేరే పెళ్లి చేసేసుకున్నాడు. అతని మాట నమ్మి మోసపోయిన యువతి ప్రియుడిని నిలదీసినా ఉపయోగం లేకుండాపోయింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించి సీన్ లోకి ఎంటర్ అయ్యేసరికి పెళ్లి కూడా అయిపోయింది.
గంగవరం మండలంలోని మిట్టమీద కురప్పల్లెలో శుక్రవారం జరిగింది ఈ ఘటన. పెద్దపంజాణి మండలానికి చెందిన యువతి బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తోంది. అదే కంపెనీలో పని చేసే గణేష్‌తో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆరేళ్ల పాటు ప్రేమించుకుని పెళ్లికి అనుమతి కావాలని ఇరువురి తల్లిదండ్రులను అడిగారు.
దీనిపై ఏ నిర్ణయం తెలియకుండానే కొవిడ్ లక్షణాలున్నాయని చెప్పిన గణేష్ మూడునెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. కుటుంబ సభ్యులు బంధువుల అమ్మాయితో పెళ్లి అనేసరికి రెడీ అయిపోయాడు గణేష్. పెళ్లికొడుకు ఇంట్లోనే గురువారం వేకువజామున పెళ్లి జరిగేలా ఫిక్స్ చేసేశారు.
బాయ్ ఫ్రెండ్ స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రేమికురాలు బెంగళూరు నుంచి గణేశ్ ఇంటికి చేరుకునేలోపే పెళ్లి జరిగిపోయింది. బాధితురాలు గంగవరం, పెద్దపంజాణి పోలీసులకు కంప్లైంట్ చేసింది. అక్కడితో ఆగిపోకుండా గురువారం రాత్రి వధువు ఇంటి వద్ద ఫస్ట్ నైట్‌కి సిద్ధం చేస్తున్నారని తెలుసుకుని అక్కడకు వెళ్లింది.
ప్రియుడిని నిలదీస్తుండగా బంధువులంతా కలిసి ఆమెపై దౌర్జన్యానికి దిగారు. మళ్లీ విషయం పెద్దపంజాణి పోలీసుల వరకూ వెళ్లి కేసు నమోదైంది. నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు వచ్చేటప్పటికీ.. ఫస్ట్ నైట్‌కు బ్రేక్ ఇచ్చిన భార్యాభర్తలు పరరయ్యారు. తనను మోసం చేసిన ప్రియుడిని అరెస్టు చేయాలని బాధితురాలు కోరుతోంది.