NTR Bharosa Pension: ఏపీ ప్రజలకు శుభవార్త.. ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల మంజూరుకు డేట్ ఫిక్స్.. కావాల్సిన సర్టిఫికేట్లు ఇవే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా(NTR Bharosa Pension) పథకం కింద నూతన పింఛన్ల మంజూరుకు సన్నాహాలు వేగవంతం చేసింది.

NTR Bharosa pension scheme new applications starting from September 7

  • సెప్టెంబర్ 07 నుండి దరఖాస్తులు
  • గ్రామ సచివాలయాల్లోనే ఈ-కేవైసీ
  • ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా మంజూరు

NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద నూతన పింఛన్ల(NTR Bharosa Pension) మంజూరుకు సన్నాహాలు వేగవంతం చేసింది. అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు పక్కా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల సెప్టెంబర్ 07 నుంచి నూతన దరఖాస్తుల స్వీకరణతో పాటు ఈ-కేవైసీ (eKYC) ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులు, మత్స్యకారులు తమ సమీప సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Bhogapuram Incident: భోగాపురంలో అమానుషం.. బైక్ రిపేర్ డబ్బులు ఇవ్వలేదని.. మెడకు తాడు కట్టి, ఈడ్చుకెళ్లిన మెకానిక్

సచివాలయాల్లో దరఖాస్తు నమోదు.. సమర్పించాల్సిన పత్రాలివే:

అర్హులైన లబ్ధిదారులు ఆధార్ కార్డు, రైస్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో సచివాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది. వితంతువులు భర్త డెత్ సర్టిఫికేట్, దివ్యాంగులు సదరమ్ సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా జత చేయాలి. డిజిటల్ అసిస్టెంట్ ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదు చేసి వెంటనే రసీదు జారీ చేస్తారు.

క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే మంజూరు.. పారదర్శకంగా ఎంపిక:

ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అందించిన వివరాలు, పత్రాలు సరైనవని తేలితేనే నూతన పింఛన్ మంజూరు అవుతుంది. అర్హులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పింఛన్ పంపిణీలో పారదర్శకత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యంత్రాంగం తెలిపింది.