×
Ad

Sridhar Reddy : మా పార్టీ వాళ్లే నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు : ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

తాను ప్రజల మనిషిని.. రుణాలు ఎగ్గొట్టి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను బలి పశువును చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తాను పారిపోయే వ్యక్తిని కాదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

  • Published On : July 21, 2023 / 09:54 PM IST

Sridhar Reddy

MLA Sridhar Reddy : తమ పార్టీలో వాళ్లే తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. తనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక తమ పార్టీలోని కురువృద్ధుడు టీడీపీలోని కురువృద్ధుడు ఏకమై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బ్యాంకు రుణాల ఎగవేత ఘటన, కెనరా బ్యాంక్ నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మీడియాతో మాట్లాడారు.

తాను ప్రజల మనిషిని.. రుణాలు ఎగ్గొట్టి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను బలి పశువును చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తాను పారిపోయే వ్యక్తిని కాదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. రావాల్సిన నగదు ఆరు నెలలుగా రాలేదన్నారు. కరోనా వల్ల బ్యాంకుకు రుణాలు చెల్లించడం ఆలస్యం అయిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు.

Gidugu Rudra Raju : జగన్ నడుపుతున్నది నకిలీ కాంగ్రెస్.. వైసీపీలో బానిసలుగా ఉన్నవారంతా తిరిగి కాంగ్రెస్ లోకి రావాలి : గిడుగు రుద్రరాజు

తాను ఎలాంటి వాడినో నియోజకవర్గంలో ఏ ఒక్కరిని అడిగినా చెబుతారని తెలిపారు. వ్యాపారం అన్నాక ఒడిదుడుకులు సహజమే పారిపోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. బ్యాంకర్స్ శనివారం మీటింగ్ ఏర్పాటు చేసినా తాను హాజరవుతానని చెప్పారు. వీలైనంత త్వరలో బ్యాంకులకు రుణాలన్నీ చెల్లిస్తానని, అందులో ఎటువంటి అనుమానాలు వద్దన్నారు.

అనంతపురంలోని రుద్రంపేట వద్ద ఎస్సీ, మైనార్టీల భూములు కాజేసింది పల్లె రఘునాథ్ రెడ్డి అని ఆరోపించారు. ఆయన పార్టీ లీడర్లకు చెక్కులు ఇచ్చి మోసం చేసింది కూడా పల్లె రఘునాథ్ రెడ్డి అని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి రాజకీయాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు.

Vikram Goud : గోషామహల్ సీటు నాదే.. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తా : విక్రమ్ గౌడ్

ఇక్కడ తాను ఉన్నంతకాలం గెలవలేనని పల్లె రఘునాథ్ రెడ్డి భయపడుతున్నాడని పేర్కొన్నారు. తాను కాకుండా మరెవరు పోటీ చేసినా డబ్బులు ఇస్తే అమ్ముడుపోతారని ఆయనకు తెలుసని తెలపారు. పుట్టపర్తి నియోజకవర్గంలో నిలబడేది తానేనని, గెలిచేది కూడా తానేనని ఇందులో అపోహలేమీ ఉండవద్దని స్పష్టం చేశారు.