Vikram Goud : గోషామహల్ సీటు నాదే.. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తా : విక్రమ్ గౌడ్

రాజాసింగ్ పై పెట్టిన సస్పెన్షన్ బీజేపీ కేంద్ర అధిష్టానం పరిధిలో ఉందని తెలిపారు. ఆయన సేవలు కూడా పార్టీకి అవసరం కాబట్టి ఆ దిశగా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

Vikram Goud : గోషామహల్ సీటు నాదే.. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తా : విక్రమ్ గౌడ్

Vikram Goud

Vikram Goud Contest Goshamahal : రానున్న ఎన్నికల్లో బీజేపీ తరపున గోషామహల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు, బీజేపీ నేత విక్రమ్ గౌడ్ అన్నారు. తన కుటుంబానికి గోషామహల్ నియోజకవర్గ ప్రజలతో 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. రాజాసింగ్ పై పెట్టిన సస్పెన్షన్ బీజేపీ కేంద్ర అధిష్టానం పరిధిలో ఉందని తెలిపారు.

ఆయన సేవలు కూడా పార్టీకి అవసరం కాబట్టి ఆ దిశగా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గోషామహల్ నియోజకవర్గం నుండే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. రాజాసింగ్ ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కూడా కోరుతానని తెలిపారు. బీజేపీ నేత విక్రమ్ గౌడ్ తో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ భేటి అయ్యారు.

Minister KTR : మోదీ స‌ర్కార్ తెలంగాణ‌కు న‌యా పైసా ఇవ్వ‌లేదు.. విభ‌జ‌న చ‌ట్టంలోని ఒక్క హామీని నెర‌వేర్చ‌లేదు : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ ఎంజే మార్కెట్ లోని విక్రమ్ గౌడ్ నివాసంలో ఈటల రాజేందర్ భోజనం చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో తాజా రాజకీయాలపై ఈటెల రాజేందర్ చర్చించారు. ఈటెల రాజేందర్ మొన్న రాజాసింగ్ ని, ఈ రోజు విక్రమ్ గౌడ్ ని కలవడంపై గోషామహల్ లో రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. గోషామహల్ బీజేపీలో ఏం జరుగుతుంది అనేదానిపై ఆసక్తి నెలకొంది.