AP Politics : అనంతపురం జిల్లా టీడీపీలో తీవ్రమవుతున్న టికెట్ల గొడవ.. శ్రీరామ్ వర్గీయుల ఆందోళన
కష్టకాలంలో శ్రీరామ్ మాకు అండగా నిలిచాడు. అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా.. బీజేపీ నేతకు ధర్మవరం టికెట్ ఇస్తే తమ పరిస్థితి ఏమిటని ..
- Harishth Thanniru
- Published On : March 15, 2024 / 02:26 PM IST
Paritala Sriram
Paritala Sriram : తెలుగుదేశం పార్టీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 34మందితో రెండో లిస్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ లిస్టులో టికెట్ దక్కని ఆశావహులు ఆందోళనకు దిగుతున్నారు. పలు నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ నేతలు, వారి అనుచరులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. మరికొందరు నేతలు చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లాలోనూ టీడీపీలో రోజురోజుకు టికెట్ల గొడవ తీవ్రమవుతుంది. ధర్మవరం టికెట్ శ్రీరామ్ కు కేటాయించాలంటూ టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో హిందూపురం అధ్యక్షుడు పార్థసారథి ఇంటిని నాయకులు చుట్టుముట్టారు. శ్రీరామ్ కు ధర్మవరం టికెట్ కేటాయించే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు. దీంతో పార్థసారథి నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Also Read : టీడీపీ నేతలపై జనసేన నేత పోతిన మహేశ్ సంచలన వ్యాఖ్యలు..
సూరి తమను ఏరోజూ పట్టించుకున్న పాపాన పోలేదు. కష్టకాలంలో శ్రీరామ్ మాకు అండగా నిలిచాడు. అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా.. ధర్మవరం టికెట్ సూరికి ఇస్తే తమ పరిస్థితి ఏమిటని శ్రీరామ్ అనుచరులు ప్రశ్నించారు. శ్రీరామ్ కు ధర్మవరం టికెట్ కేటాయించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో పార్థసారధి వారి వద్దకు వెళ్లి.. మీ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు. ధర్మవరం టికెట్ పరిటాల శ్రీరామ్ కు కేటాయించకుంటే మేమంతా కలిసి పార్టీకి వ్యతిరేకంగా కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
