×
Ad

Paritala Sunitha: శ్రీరామ్ పోటీ చేసే స్థానం ప్రకటించిన పరిటాల సునీత

రాబోయే ఎన్నికల్లో గెలుపు పరిటాల కుటుంబానికి చాలా కీలకం.

  • Published On : January 11, 2022 / 12:34 PM IST

Sunitha

Paritala Sunitha: రాబోయే ఎన్నికల్లో గెలుపు పరిటాల కుటుంబానికి చాలా కీలకం. దశాబ్ధాలుగా అనంతపురం రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్న పరిటాల కుటుంబం నుంచి పరిటాల శ్రీరామ్ రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. పరిటాల శ్రీరామ్ గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

తర్వాత మారిన సమీకరణాల్లో భాగంగా శ్రీరామ్.. ధర్మవరం నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే పార్టీ అతనిని ఆ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఈ క్రమంలోనే ధర్మవరం నియోజకవర్గంలో తల్లి పరిటాల సునీతతో కలిసి పర్యటించిన శ్రీరామ్.. అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు తల్లి సునీత.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తన బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నానని, ఆశీర్వదించాలని విజ్ఙప్తి చేశారు పరిటాల సునీత. రాప్తాడు నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సునీత.. అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను బరిలోకి దించగా 25వేల ఓట్ల తేడాతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.