ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదు : CAAకు పవన్ కళ్యాణ్ మద్దతు

దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పైనా జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఏఏపై నెలకొన్న అనుమానాలను, భయాలను తొలగించే

  • Publish Date - January 16, 2020 / 10:49 AM IST

దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పైనా జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఏఏపై నెలకొన్న అనుమానాలను, భయాలను తొలగించే

దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పైనా జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఏఏపై నెలకొన్న అనుమానాలను, భయాలను తొలగించే ప్రయత్నం చేశారు. సీఏఏకు పవన్ మద్దతు తెలిపారు. దేశం నుంచి విడిపోయినప్పుడు పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకుందని.. కానీ మన దేశం మాత్రం హిందూ దేశంగా ప్రకటించుకోలేదని పవన్ గుర్తు చేశారు. పాకిస్తాన్ లో మైనార్టీలు తగ్గిపోయారని, హిందువులపై దాడులు జరుగుతున్నాయని పవన్ వాపోయారు. పాకిస్తాన్ మైనార్టీ క్రికెటరే ఇబ్బంది ఎదుర్కొంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు.

సీఏఏపై ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని, ముస్లింల పౌరసత్వం తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పవన్ ఆరోపించారు. భారతీయ పౌరులకు సీఏఏతో ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. మైనార్టీలను రక్షించేందుకే సీఏఏ అని తేల్చి చెప్పారు. అన్ని మతాలను సమానంగా గౌరవించే దేశం మనది అని పవన్ చెప్పారు. గాంధీ, నెహ్రూ ఆలోచనలనే ప్రధాని మోడీ అమలు చేస్తున్నారని వివరించారు. సీఏఏతో ముస్లింలకు పౌరసత్వం తీసేస్తారని అసత్య ప్రచారం చేస్తున్నారని పవన్ అన్నారు.

ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. కొత్త బంధం మొదలైంది. ఇకపై రాష్ట్రంలో కలిసి పని చేయాలని బీజేపీ-జనసేన నిర్ణయించాయి. ఏపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ-జనసేన పని చేస్తాయని బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం(జనవరి 16,2020) విజయవాడలో బీజేపీ-జనసేన కీలక నేతల మధ్య సుదీర్ఘ సమావేశం(మూడున్నర గంటలు) జరిగింది. ఈ సమావేశంలో ఇరు పార్టీల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రంలోని పరిణామాలపై సమావేశంలో చర్చించారు. కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశం వివరాలను మీడియాకు తెలిపిన పవన్.. సీఏఏపైనా స్పందించారు.

CAAకు పవన్ కళ్యాణ్ మద్దతు
* అన్ని మతాలను సమానంగా గౌరవించే దేశం భారత్
* పాకిస్తాన్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి
* పాకిస్తాన్ లో మైనార్టీల సంఖ్య తగ్గిపోయింది
* దేశం నుంచి విడిపోయినప్పుడు పాకిస్తాన్ ఇస్లామ్ దేశంగా ప్రకటించుకుంది
* మన దేశం హిందూ దేశంగా ప్రకటించుకోలేదు

* గాంధీ, నెహ్రూ ఆలోచనలే ప్రధాని మోడీ అమలు చేస్తున్నారు
* ముస్లింలకు పౌరసత్వం తీసేస్తారని అసత్య ప్రచారం చేస్తున్నారు
* మైనార్టీలను రక్షించేందుకే సీఏఏ
* భారతీయ పౌరులకు సీఏఏతో ఎలాంటి ఇబ్బంది లేదు
* సీఏఏ గురించి విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి

Also Read : 2024లో అధికారం మాదే : రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీతో కలిశా

ట్రెండింగ్ వార్తలు