JanaSena Party : పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్.. చేరికలకు గ్రీన్‌సిగ్నల్.. వైసీపీ నుంచి జాయినింగ్స్!
Pawan Kalyan : ఏపీలో జనసేన పార్టీ బలోపేతానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నారు. కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాకూడా సొంతంగా పార్టీని బలంగా తయారు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు.
- Harish Thanniru
- Published on- June 19, 2026 / 02:27 PM IST
JanaSena Party Pawan Kalyan
- నెక్ట్స్ ఎలక్షన్ ప్లాన్.. పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్
- కూటమిలో ఉంటూనే స్ట్రాంగ్ ఫోర్స్‌గా రెడీ అయ్యే ప్లాన్ ..
- చేరికలకు పవన్ గ్రీన్‌సిగ్నల్.. వైసీపీ నుంచి జాయినింగ్స్!
- జాయినింగ్స్ కమిటీ.. త్వరలో భారీగా చేరికలకు స్కెచ్
JanaSena Party : దారుణ ఓటమి ఎదురైనా వెనక్కి తగ్గలేదు. తానే ఓడినా.. మొక్కవోని దీక్షతో పోరాడి తలపడి, నిలబడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఒక్క సీటుతో చట్టసభల్లోకి అడుగుపెట్టి.. ఏకంగా పోటీ చేసిన 21 సీట్లలో 21 గెలిచి హండ్రెడ్ పర్సెంజ్ స్టైక్ రేటుతో నేషనల్ పాలిటిక్స్‌లో చరిష్మా ఉన్న లీడర్‌గా ఎస్టాబ్లిష్ అయ్యారు. పవర్‌లోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వం, పాలనపైనే దృష్టిపెట్టారు. కానీ ఇప్పుడు జనసేనాని రూట్ మార్చినట్లు కనిపిస్తోంది.
పార్టీ పటిష్టత కోసం.. స్ట్రాంగ్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసే పనిలో పవన్ కల్యాణ్ నిగ్నమైనట్లు తెలుస్తోంది. కూటమిని డిస్ట్రబ్ చేయకుండానే.. వచ్చే ఎన్నికల నాటికి మరింత బలపడి స్ట్రాంగ్ ఫోర్స్‌గా మారాలని వ్యూహాలు రచిస్తున్నారట. ఈ క్రమంలోనే సభ్యత్వ నమోదు, శిక్షణా తరగతులు, జెన్ జీ సెంట్రిక్‌గా పాలిటిక్స్ చేస్తున్నారు. ఇదంతా ఒకవైపు అయితే ఆల్రెడీ లీడర్లుగా పేరున్న నేతలను చేర్చుకుంటే.. మెజార్టీ సీట్లు గెలుచుకోవచ్చని లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే చేరికలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. టీడీపీ, బీజేపీ నుంచి కాకుండా.. వైసీపీ నుంచి వలసలకు గేట్లు ఎత్తాలని డిసైడ్ అయినట్లు టాక్.
ఏపీలో పార్టీ బలోపేతానికి పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నారు పవన్ కల్యాణ్. కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాకూడా సొంతంగా పార్టీని బలంగా తయారు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఒక పక్క జిల్లాల వారిగా సమీక్షలు నిర్వహిస్తూ.. మరోపక్క ఆరోపణలు వచ్చిన వారికి వార్నింగ్ ఇస్తూ.. ఇంకోపక్క కొత్తవారిని పార్టీలోకి తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ బలోపేతం అంటే పాత నేతలను బలంగా తయారుచేయడంతో పాటు కొత్తవారిని పార్టీలోకి తీసుకుని పార్టీని పటిష్టం చేయాలని అనుకుంటున్నారట పవన్.
పార్టీలో చేరికలకోసం జాయినింగ్స్ కమిటీ పేరుతో ఓ టీమ్‌ను నియమించారు పవన్ కల్యాణ్. 14 మంది సభ్యులతో కమిటీ వేయగా.. ఈ టీమ్‌లో ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు. త్వరలోనే ఈ టీమ్‌తో సమావేశం ఏర్పాటుచేసి చేరికలకోసం అనుసరించాల్సిన విధానాలను పవన్ కల్యాణ్ దిశానిర్ధేశం చేయనున్నారని తెలుస్తోంది.
జనసేనలో మొదటి నుంచి పార్టీ జెండా మోసిన నేతలే ఎక్కువ శాతం ఉన్నారు. అయితే 2019, 2024 ఎన్నికల్లో కొందరు బయటికి వెళ్లిపోయారు. ఇక ఇతర పార్టీల నుంచి తక్కువ సంఖ్యలో మాత్రమే చేరికలు జరిగాయి. అయితే 2024 ఎన్నికల తర్వాత బాలినేని, సామినేని ఉదయబాబు, కిలారు రోశయ్య వంటి వారు వైసీపీ నుంచి వచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా పార్టీని బలోపేతం చేసే పనిలో భాగంగా చేరికలపై దృష్టి పెట్టారు పవన్. కూటమి పార్టీల నుంచి చేరికలు ఎలాగూ ఉండవు. వైసీపీలో సంతృప్తిగాలేని నేతలను, ప్రజల్లో గుర్తింపు ఉన్న నాయకులను.. నాన్ కాంట్రవర్సీ లీడర్లను.. ఇలా అన్ని ఈక్వేషన్స్ లెక్కలోకి తీసుకుని చేరికలు చేసుకోవాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది.
మరో రెండు నెలల్లో జరగనున్న స్థానిక ఎన్నికలతో పాటు ఇంకో మూడేళ్ల తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. అటు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఈ చేరికలు ఉండనున్నాయి. మరి కొత్తగా వచ్చేవారితో.. జనసేనలో పాత, కొత్త నేతలు ఎలా కలిసి పోతారో..? రాబోయే ఎన్నికల్లో జనసేన గతానికి మించిన ప్రభావం చూపుతుందో లేదో చూడాలి మరి.
