×
Ad

జనంలోకి జనసేనాని.. దూకుడు వెనుక వ్యూహం అదేనా?

అటు సభ్యత్వ నమోదు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇంకోవైపు అభివృద్ధి పనులు..ఇలా అన్నింటిపై ఫోకస్ పెట్టేలా పవన్ జిల్లాల పర్యటన ఉండబోతోందట.

Pawan Kalyan

  • ప‌వ‌న్ జిల్లాల టూర్‌.. షెడ్యూల్‌ రెడీ అవుతోందా?
  • ఏప్రిల్‌ నుంచి జనంలోకి సేనాని, క్యాడర్‌తో మీటింగ్‌లు
  • స్థానిక ఎన్నికలు, సభ్యత్వ నమోదుపై సీరియస్‌గా ఫోకస్

Pawan Kalyan: పార్టీ నిర్మాణం. ఇప్పుడు పవన్ ముందున్న ప్రధాన ఎజెండా ఇదే. కొన్నాళ్లుగా పూర్తిగా సంస్థాగత బలోపేతంపై కసరత్తు చేస్తున్న సేనాని..క్యాడర్, లీడర్లకు దగ్గరయ్యేందుకు సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ ప్రజా సమస్యలపై ఫోకస్ పెడుతూనే మరోవైపు గ్రామస్థాయి నుంచి తన పార్టీని పటిష్టం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

ఇప్పటికే ఫైవ్‌ మెన్ కమిటీ అంటూ కోఆర్డినేషన్‌ టీమ్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన చేసిన పవన్..జనసేన సభ్యత్వ నమోదు కోసం పక్కా ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మెయిన్‌గా యువతను పార్టీ వైపు ఆకర్షించేలా..ప్రణాళికలు రెడీ చేసిన పవన్..ముందుగా తాను జిల్లాల పర్యటన చేయాలని భావిస్తున్నారట. వాస్తవానికి ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి జిల్లాల్లో ప‌ర్యటిస్తాన‌ని గ‌తేడాది నిర్వహించిన పార్టీ ప్లీన‌రీలోనే ప‌వ‌న్ ప్రక‌టించారు. డిస్ట్రిక్ట్‌ టూర్‌లో అటు పార్టీ యాక్టివిటీని..ఇటు ప్రజా సమస్యలు, అభివృద్ధిపై ఫోకస్ పెడుతానని చెప్పారు.

అయితే రాజకీయ పరిస్థితులు..అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో పవన్ జిల్లాల టూర్‌ ఆలస్యమవుతూ వస్తోంది. ఈ సారి మాత్రం షెడ్యూల్‌ కూడా ప్రిపేర్ చేస్తున్నారని..వరుస పెట్టి జిల్లాల పర్యటన చేస్తారని అంటున్నారు. ఏప్రిల్ లాస్ట్‌ వీక్ నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ జిల్లాల ప‌ర్యట‌న చేసే అవకాశం ఉందని టాక్. జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌కు మాత్రమే కాకుండా..మారుమూల ప్రాంతాలను కూడా విజిట్ చేయాలని అనుకుంటున్నారట. అయితే ఇన్నాళ్లు పవన్‌ జిల్లాల టూర్ వాయిదా పడుతూ వస్తుండడానికి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలే కార‌ణమని పార్టీ నేత‌లు చెబుతున్నారు.

Also Read: Somireddy: మదనపల్లి ఫైల్స్‌కు మించి సర్వేపల్లి ఫైల్స్.. నేరుగా ఆయన రంగంలోకి దిగాల్సిందే: సోమిరెడ్డి

ప్రస్తుతం పంచాయ‌తీ నిధుల‌తో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల‌లో మౌలిక స‌దుపాయాలు, రోడ్ల నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. రోడ్ల నిర్మాణ పనుల జోరుగా సాగుతున్నాయి. ఈ వర్క్ ప్రోగ్రెస్‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పటిక‌ప్పుడు ఆరా తీస్తున్నారు. అయితే చాలా జిల్లాల్లో రోడ్ల నిర్మాణం పూర్తి కావొచ్చిందని..వైసీపీ హయాంతో పోలిస్తే ఇప్పుడు రోడ్లు బాగున్నాయని పబ్లిక్ చర్చించుకుంటున్నట్లు రిపోర్ట్ వచ్చిందట. ఇదే టైమ్‌లో డిస్ట్రిక్ టూర్ పెట్టుకుని..ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందని భావిస్తున్నారట. ఇంకా ఏమైనా స్థానికంగా స‌మ‌స్యలు ఉంటే వాటిని ప‌రిష్కరించేందుకు కూడా అధికార యంత్రాగానికి ఆదేశాలు జారీ చేశారట పవన్.

ఏప్రిల్ మొద‌టి వారంలో నోటిఫికేషన్?
అయితే ఏప్రిల్ మొద‌టి వారంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆ టైమ్‌లోనే ఒకేసారి ప‌ర్యట‌న‌లు చేసే యోచనలో ఉన్నారట పవన్. మ‌రోవైపు..జనసేన పార్టీ స‌భ్యత్వ కార్యక్రమం కూడా కొనసాగుతోంది. అయితే ఎమ్మెల్యేలు ఉన్న చోట మినహా..మిగతా చోట్ల పెద్దగా సభ్యత్వ నమోదు జరగట్లేదట. వ‌చ్చే నెల నాటికి స‌భ్యత్వ మ‌రింత జోరుగా జ‌రుగుతుంద‌ని లెక్కలు వేసుకుంటున్నారు.

అటు సభ్యత్వ నమోదు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇంకోవైపు అభివృద్ధి పనులు..ఇలా అన్నింటిపై ఫోకస్ పెట్టేలా పవన్ జిల్లాల పర్యటన ఉండబోతోందట. ఏప్రిల్ చివ‌రి వారం నుంచి పదిహేను 20 రోజుల పాటు జిల్లాల పర్యటన షెడ్యూల్ రెడీ చేస్తున్నారట. విజయవాడ కేంద్రంగా రివ్యూలు, సమీక్షలు చేస్తే..గ్రౌండ్‌లో పరిస్థితులు, నేతల పనితీరు, క్యాడర్ మనోగతం ఏంటో క్లారిటీ రావట్లేదని.. ఫీల్డ్‌లోకి దిగితేనే వాస్తవాలేంటో తెలుస్తాయని భావిస్తున్నారట. అటు..ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడంతో పాటు, ఇటు స్థానిక ఎన్నికల కోసం క్యాడర్‌లో ఊపు తేవడానికి జిల్లాల పర్యటన ఉపయోగపడుతుందని లెక్కలు వేసుకుంటున్నారు జనసేన లీడర్లు.