Somireddy: మదనపల్లి ఫైల్స్‌కు మించి సర్వేపల్లి ఫైల్స్.. నేరుగా ఆయన రంగంలోకి దిగాల్సిందే: సోమిరెడ్డి
"వందల కోట్ల రూపాయల విలువైన భూముల విషయంలో అక్రమాలు జరిగాయి" అని సోమిరెడ్డి అన్నారు.
Somireddy Chandra Mohan Reddy
- వైసీపీ ఐదేళ్ల పాలనలో నేరాలు- ఘోరాలు
- సర్వేపల్లి నియోజకవర్గంలో రెవెన్యూ శాఖలో అక్రమాలు
- ఇప్పటికే మంత్రి సత్యప్రసాద్‌కు కూడా చెప్పాం
Somireddy: మదనపల్లి ఫైల్స్‌కు మించి సర్వేపల్లి ఫైల్స్ ఉన్నాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. నేరుగా రెవెన్యూ మంత్రి రంగంలోకి దిగాల్సిందేనని చెప్పారు.
అసెంబ్లీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. “వైసీపీ ఐదేళ్ల పాలనలో మా సర్వేపల్లి నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ పరంగా చాలా నేరాలు- ఘోరాలు జరిగిపోయాయి.
Also Read: జగన్ ను పట్టుకోమనా బొత్స ఉద్దేశం?: నారా లోకేశ్
మదనపల్లి ఫైల్స్ తరహాలోనే సర్వేపల్లి ఫైల్స్ కూడా చాలా ఉన్నాయని ఇప్పటికే మంత్రి సత్యప్రసాద్ కు కూడా చెప్పాం. 57 ఎకరాలు రామదాసుకండ్రిగలో, మరో 57 ఎకరాలు మరుపూరులో, 36 ఎకరాలు సూరాయపాళెంలో, 19 ఎకరాలు కొమ్మలపూడిలో… ఇలా చెప్పుకుంటూ పోతే వందల కోట్ల రూపాయల విలువైన భూముల విషయంలో అక్రమాలు జరిగాయి.
ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం చేస్తుంటే కోర్టులకు పోయి స్టేలు తెచ్చేస్తున్నారు. ప్రజల ఆస్తులను కాపాడేందుకు రెవెన్యూ అధికారులతో పాటు జీపీలు, ఏజీపీలు అప్రమత్తంగా వ్యవహరించాల్సివుంది.
సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను కోరుతున్నా. జాతీయ రహదారి పక్కనే ఉన్న వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది” అని తెలిపారు.
