ఎన్నికలు వాయిదా వేయడం కాదు…నామినేషన్ల ప్రక్రియను రద్దు చేయాలి : పవన్ కళ్యాణ్

ఎన్నికలు వాయిదా వేయడం కాదు...నామినేషన్ల ప్రక్రియను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగాలన్నారు. 

  • Publish Date - March 15, 2020 / 06:13 AM IST

ఎన్నికలు వాయిదా వేయడం కాదు…నామినేషన్ల ప్రక్రియను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగాలన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వాయిదా వేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎన్నికలు వాయిదా వేయడం కాదు…నామినేషన్ల ప్రక్రియను రద్దు చేయాలన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగాలన్నారు. 

విపక్ష సభ్యులను భయపెట్టించి నామినేషన్లు విత్ డ్రా చేసుకునేలా చెశారని విమర్శించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగలేదు కాబట్టి నామినేషన్ల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. దీనిపై కోర్టులను కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. అన్నిస్థాయిలో అధికారి బాధ్యత వహించాల్సివస్తుందన్నారు. తాము చూస్తూ కూర్చోబోమని చెప్పారు. 

ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డదారులు తొక్కబోమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో మార్పు తీసుకరావడానికి పాలనా విభాగంలో తప్పులు జరుగుతున్నప్పుడు ప్రభుత్వంతో ఏకమై అధికారులు పని చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పారు. ఏ ఏ స్థాయిలో ఏఏ అధికారులు వైసీపీతో కుమ్మక్కయ్యారో రిపోర్టు తయారు చేస్తున్నామని..రిపోర్టును ప్రజల ముందు పెడతామని చెప్పారు. పాలనావిభాగంలో తప్పులు జరుగుతున్నప్పుడు పరిరక్షించాల్సిన అధికారులు ప్రభుత్వం, రాజకీయ నేతలో ఏకమైతే చూస్తూ ఊరుకోమని తెలిపారు.

15 మార్చి 2020 మొదటి దశ పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయవలసి ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రామ పంచాయితీల ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆరు వారాలు పాటు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమీషన్ అధికారి రమేష్ వెల్లడించారు. రాష్ట్రంలో 13,368 పంచాయితీలు ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. వీటిలో 6,831 పంచాయితీలకు మహిళలకు కేటాయిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘానికి వివరాలు అందజేసింది.