రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు చేస్తున్న రకరకాల ప్రకటనలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ ఫైర్ అయ్యారు. రాజధానిని పులివెందులకు..హైకోర్టును కర్నూలుకు మార్చుకుంటే మంచిదన్నారు. పులివెందుల నుంచి కర్నూలుకు దగ్గర అవుతుందన్నారు. పులివెందులలో జగన్ ఇల్లు ఉందని…వెళ్లి రావడానికి సులువుగా ఉంటుందని చెప్పారు. పులివెందుల నుంచి కోర్టుకు వెళ్లడానికి ఖర్చు తగ్గుతుందన్నారు పవన్.
రాజధానిపై ఇటీవలి కాలంగా వస్తున్న వార్తలను చూసి పవన్ కళ్యాణ్ వ్యంగాస్త్రాలు విసిరారు. ఇప్పటికే రాజధాని మీద క్లారిటీ లేకుండా కమిటీలు వేసుకుంటూ వెళ్తున్నారని ఇటు అభిమానులు గానీ, అటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాసులు పవన్ కళ్యాణ్ అడగటంతో ఆయన అడిగారు. రాజధాని ఎక్కడ, హైకోర్టు ఎక్కడ అని విజయనగరం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానమిస్తూ ఇలా వ్యంగాస్త్రాలు విసిరారు.
ఇటీవల జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యేందుకు జగన్ కు ఖర్చులు ఎక్కువవుతున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని పవన్..జగన్ పై సెటైర్లు వేశారు. ముఖ్యంగా రాజధానిపై క్లారిటీ లేనప్పుడు రాజాధానిని కూడా పులివెందులకు మార్చుకుంటే బాగుంటుందన్నారు. పులివెందులలో జగన్ కు ఇల్లు ఉంది కాబట్టి అక్కడి నుంచి కర్నూలుకు దగ్గర అన్నారు. కర్నూలుకు హైకోర్టు రావాలనే డిమాండ్ ఉన్న క్రమంలో అక్కడికి హైకోర్టును తీసుకెళ్లి పులివెందుల నుంచి కర్నూలు చాలా దగ్గర కాబట్టి అక్కడి నుంచే ఆయన కోర్టుకు వెళ్తారని..ఖర్చులు కూడా తగ్గుతాయని పవన్ చెప్పారు.
ఈ సందర్భంగా పవన్…బొత్స సత్యానారాయణకు చూడా కౌంటర్ వేశారు. బొత్సకు చీపురుపల్లిలో హైకోర్టు పెడితే బాగుంటుందేమోనని అన్నారు. జగన్, బొత్సను టార్గెట్ చేస్తూ వ్యంగాస్త్రాలు విసిరారు పవన్. రాజధాని విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని గతంలో పవన్ అడిగిన విషయం తెలిసిందే.