చిరంజీవిని దేవుడంటున్న దువ్వాడ శ్రీనివాస్ మరి పవన్ కల్యాణ్‌పై రగిలిపోతున్నారెందుకు? క్లారిటీ వచ్చేసింది..
"తానేమి దాని గురించి మాట్లాడనని, తాను సినిమాలు చూసుకోవాలని పవన్ అన్నారు. గెట్ అవుట్.. గెట్ అవుట్ అనేశారు. ఇప్పుడు జనసేన కార్యకర్తలకి అది తెలియదు" అని అన్నారు. (MLC Duvvada Srinivas)

MLC Duvvada Srinivas
MLC Duvvada Srinivas: చిరంజీవిని దేవుడంటున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరి పవన్ కల్యాణ్‌పై రగిలిపోతున్నారెందుకు? ఈ ప్రశ్నకు దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. 10టీవీ పాడ్‌కాస్ట్‌లో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడారు.
“చిరంజీవి లాంటి గుడ్ పర్సన్ ని నేను రేర్ గా చూస్తుంటాను. నాకు పార్టీలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశారు. నాకు టికెట్ ఇవ్వకూడదని ఆ రోజు కూడా పీఆర్పీలో కూడా గట్టిగా మా జిల్లా నుంచి ప్రయత్నం జరిగినప్పటికీ నాకు టికెట్ ఇవ్వకపోతే అర్థం లేదని టికెట్ ఇచ్చారు.
బై ఎలక్షన్ లో కూడా నాకోసం టెక్కలి వచ్చి దగ్గరుండి నామినేషన్ వేయించారు. వర్షంలో తడుచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆ రాజశేఖర్ రెడ్డి కొన్ని రోజుల్లోనే మరణించారు. ఆ మరణానంతరం నేను పూర్తిగా ప్రచారం ఆపేసాను. ఆపేసిన తర్వాత చిరంజీవి నాకు డబ్బులు ఖర్చు అయి ఉంటాయని, నాకు డబ్బులు పంపించారు.
పెద్ద మొత్తమే పంపించారు. ఎంత మంచి మనసు.. ఎంత గొప్ప విషయం. ఇవి చిరంజీవిలో ఉన్న గుడ్ క్వాలిటీస్. మా దురదృష్టం ఆయన కాంగ్రెస్‌లో పీఆర్పీని కలపకపోతే ఎప్పటికైనా ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండేవారు. రాష్ట్రంలో ఉండే కాపుల కల నెరవేరి ఉండేది. ఆయన 18 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచి, 75 లక్షల ఓటు షేర్ తీసుకున్న వ్యక్తి.
దుష్ట రాజకీయాలను ఆయన భరించలేరు. పవన్ కల్యాణ్‌తో నాకు యాక్సెస్ రాలే. ఎందుకంటే, పీఆర్పీని కాంగ్రెస్‌లో కలిపేస్తున్నప్పుడు మేము పవన్‌ను కలవటానికి వెళ్లాం ఒకసారి. పార్టీని కాంగ్రెస్‌లో మెర్జ్ చేసేస్తాం అంటున్నారని, ఎలియన్స్ పెట్టుకుందామని, మెర్జింగ్ ఎందుకని అన్నాం.
మనకు మంచి రోజులు ఉంటాయని అన్నాను. తానేమి దాని గురించి మాట్లాడనని, తాను సినిమాలు చూసుకోవాలని అన్నారు. గెట్ అవుట్ గెట్ అవుట్ అనేశారు. ఇప్పుడు జనసేన కార్యకర్తలకి అది తెలియదు” అని అన్నారు. (MLC Duvvada Srinivas)