Ambati Rambabu : పవన్ జీవితంలో అసెంబ్లీకి వెళ్ళలేడు.. చంద్రబాబును సీఎం చెయ్యలేడు : మంత్రి అంబటి రాంబాబు

చంద్రబాబు పతకం ప్రకారమే పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలోనే తిరుగుతున్నాడని ఆరోపించారు. గోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్న కాపుల్ని టీడీపీకి దగ్గర చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.

Ambati Rambabu

Pawan Kalyan – Chandrababu : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఆవేశంతో ఊగిపోవడం పవన్ కు అలవాటేనని పేర్కొన్నారు. చెప్పులు చూపించి భూతులు తిట్టినప్పుడు పవన్ సంస్కారం ఏమైందని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం అమరావతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ను జగ్గూబాయ్ అని పిలుస్తున్న పవన్ పేరులోనే గాలి ఉందన్నారు. పవన్ కళ్యాణ్ అంటే గాలి కళ్యాణ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పతకం ప్రకారమే పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలోనే తిరుగుతున్నాడని ఆరోపించారు. గోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్న కాపుల్ని టీడీపీకి దగ్గర చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.

Sukesh Chandrasekhar : గవర్నర్ కు సుఖేశ్ చంద్రశేఖర్ ఫిర్యాదు లేఖ.. కేటీఆర్, కవితపై సంచలన ఆరోపణలు

కాపులకు టీడీపీపై ఉన్న కోపాన్ని తగ్గించడానికే అక్కడ పవన్ యాత్ర చేపట్టారని విమర్శించారు. చంద్రబాబు అక్రమ కేసులు పెట్టి వేధిస్తే జగన్ వాటిని తొలగించారని పేర్కొన్నారు. జగన్ వైపు ఉన్న కాపుల్ని టీడీపీ వైపు తిప్పడానికే అక్కడక్కడే తిరుగుతున్నాడని విమర్శించారు. మల్టిపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ వ్యాధి పవన్ ను ఆవహించిందని ఎద్దేవా చేశారు.

రాజకీయాలకు పవన్ కళ్యాణ్ పనికిరాడని వ్యాఖ్యానించారు. పవన్ రాజకీయ, వ్యక్తిగత జీవితంలో నిలకడ లేదని, ఎవరూ ఆయనతో పూర్తిగా లేరని చెప్పారు. పవన్ ను దగ్గరగా చూసిన వాళ్ళు ఆయనతో ఉండరు.. వెళ్ళిపోతారని ఎద్దేవా చేశారు. జేఎస్పీ స్థాపించినప్పటి నుండి అనేకమంది వెళ్లారు.. పవన్ ను దగ్గరగా చూసి పారిపోయారని ఆరోపించారు. సీఎం అవ్వడానికి జగన్ ఎన్ని కష్టాలు, నష్టాలు పడ్డారో తెలుసుకోవాలని సూచించారు.

Nara Lokesh: మంగళగిరి కోర్టుకు నారా లోకేశ్.. అందరి సంగతి తేలుస్తా.. వైసీపీ నేతలకు వార్నింగ్

జగన్ పేరెత్తే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదన్నారు. మైక్ పట్టుకుని ఊగిపోతే పెద్ద పోరాట యోధుడు అనుకుంటున్నావా అని నిలదీశారు. పవన్ క్యారెక్టర్ ఏంటో సినిమాల్లో లైట్ బాయ్ ను అడిగినా చెప్తారని తెలిపారు. పవన్ జీవితంలో అసెంబ్లీకి వెళ్ళలేడు.. చంద్రబాబును సీఎం చెయ్యలేడు అని స్పష్టం చేశారు. పవన్ ది పోరాటం కాదు ఆరాటం మాత్రమేనని విమర్శించారు.

పోరాటం అంటే రోజూ మీటింగ్ లు పెట్టడమేనా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చెప్పులు కాదు పోయింది.. మైండ్ పోయింది అని ఎద్దేవా చేశారు. చెప్పులు పోతే కొనుక్కోవచ్చు.. మైండ్ పోతే ఎలా అని సెటైర్ వేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నది కేంద్రం అధీనంలోనే అనే విషయం పురంధరేశ్వరి తెలుసుకోవాలన్నారు. ప్రాజెక్టు కంట్రోల్ మొత్తం పోలవరం ప్రాజెక్టు అథారిటీ చేతిలోనే ఉంటుందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు