Perni Nani: నాదెండ్ల మనోహర్ మాట తప్ప వారిమాట వినవా? పవన్‌పై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

ఏపీలో నిత్యం కులం గురించి మాట్లాడేది పవన్ ఒక్కరే. కుల ప్రస్తావన లేకుండా పవన్ నోరు తెరవడం లేదు అంటూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని పవన్ కళ్యాణ్‌ను విమర్శించారు.

YCP MLA Perni Nani: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కోసమే పవన్ పార్టీ పెట్టాడు, రైతుల వంక పెట్టుకొని టీడీపీ కోసం రాష్ట్రానికి వచ్చాడు. జగన్ ను తిట్టి చంద్రబాబు మెప్పు పొందడానికి పవన్ రాష్ట్రానికి వచ్చాడు అంటూ పేర్ని నాని విమర్శించారు. 137 సీట్లు పోటీచేస్తే 30 సీట్లు అయినా గెలిపించలేదని పవన్ కాపులను తిడుతున్నాడు. కాపుల‌కోసం నువ్వేం చేశావ్? నీపై కాపులకు నమ్మకం ఎందుకు ఉంటుందని పేర్ని నాని ప్రశ్నించారు.

Perni Nani : చంద్రబాబు అవసరాలకు పెట్టిన టెంట్ హౌస్ జనసేన- పేర్నినాని

పట్టుమని 10రోజులు ఏపీలో ఉండి ప్రజల్లో ఉన్నావా? నాదెండ్ల మనోహర్ మాట తప్ప ప్రజల మాట, కాపుల మాట ఎప్పుడైనా విన్నావా..? రిజర్వేషన్ ఇస్తానని కాపుల్ని మోసం చేసింది చంద్రబాబు.. పవన్ ఎందుకు అడగలేదు అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. కాపులను చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి ధగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు ఇస్తాను అంటే మోసం చేయడమే అని జగన్ నిజాయితీగా చెప్పారు. జగన్ నిజాయితీ కాపులకు నచ్చింది కనుక ఓట్లు వేశారని పేర్ని నాని పేర్కొన్నారు.

Minister KTR: లండన్‌లో కేటీఆర్.. 22ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో చూశారా?

జగన్‌కు సంబంధమేంటి?

సినిమాకు కలెక్షన్లు రాకుంటే సీఎం జగన్ కు సంబంధమేంటి అని పేర్ని నాని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. అసలు పవన్ మార్కెట్ ఎంత..? 100 కోట్లు దాటిన సినిమా ఒక్కటైనా ఉందా..? భీమ్లా 30కోట్లు నష్టం వచ్చిందని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. సినిమా బాగుంటే కలెక్షన్లు వస్తాయి. నీ సినిమా బాలేదు కలెక్షన్లు రాలేదు. దానికి జగన్‌కు ఏంటి సంబంధం అంటూ ప్రశ్నించారు. వాల్తేరు వీరయ్య సినిమా బాగుంది కనుక 100 కోట్లు దాటింది. మంచి కథ ఎతుక్కో కలెక్షన్లు వస్తాయి. రీమేక్ సినిమాలు తీసి డబ్బులు పోగేసుకుంటున్నావ్ అంటూ ఎద్దేవా చేశారు.

Karnataka Congress CM: సిద్ధరామయ్య, శివకుమార్‌లలో సీఎం ఎవరు..? అదిరిపోయే ప్లాన్‌లో కాంగ్రెస్.. బెంగళూరుకు రేవంత్ రెడ్డి

కుల ప్రస్తావన తెచ్చేది నువ్వొక్కడివే?

ఏపీలో నిత్యం కులం గురించి మాట్లాడేది పవన్ ఒక్కరే. కుల ప్రస్తావన లేకుండా పవన్ నోరు తెరవడం లేదు. చంద్రబాబు‌ను తిడితేనే పవన్‌కి మానవత్వం పొంగిపోద్ది. జగన్‌ను అయన కుటుంబాన్ని పట్టాభి తిట్టినప్పుడు నీ మానవత్వం ఎండిపోయిందా పవన్ అంటూ పేర్నినాని ప్రశ్నించారు.

Hindu Ekta Yatra: లక్ష మందితో హిందూ ఏక్తాయాత్ర.. ముఖ్యఅతిథులుగా వచ్చేది ఎవరో తెలుసా?

వారాహి ఏమైంది..?

వారాహి ఏమైంది పవన్ అంటూ పేర్నినాని ప్రశ్నించారు. అక్టోబర్, నవంబర్ అయిపోయింది మళ్ళీ జూన్ అంటున్నాడు. జూన్ వచ్చాక మళ్ళీ జనవరి అంటాడు అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఓటింగ్ శాతం చంద్రబాబు దగ్గర బేరానికి తప్ప ఇంకెందుకు ఉపయోగపడదని విమర్శించారు. నువ్వు సీఎం అభ్యర్థి అయితే మాకేంటి.. కాకపోతే మాకేంటి..? 2014లానే పోటీ చెయ్యకుండా చంద్రబాబు‌తో కలిసి తిరుగు మాకేంటి..? పవన్ మొదటి నుండీ చంద్రబాబు మనిషే అని మేము చెప్తున్నాం. పవన్‌కు జగన్ నచ్చాల్సిన అవసరం లేదు. ప్రజలకి నచ్చితే చాలు అని పేర్నినాని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు