×
Ad

Ambati Rambabu: అంబటి రాంబాబుపై పోలీసులు పీటీ వారెంట్ దాఖలు

అంబటి కస్టడీ పిటిషన్లపై కూడా రేపు కోర్టు తీర్పు వెల్లడించనుంది.

Ambati Rambabu

  • మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్‌ను వ్యతిరేకించిన అంబటి
  • ఆందోళనలో బారికేడ్లను తోసుకుంటూ వెళ్లినందుకు కేసు
  • రాంబాబును రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్‌ను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలో బారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనపై అంబటిపై అప్పట్లోనే కేసు నమోదైంది.

పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులోనే అంబటి రాంబాబును కోర్టులో ప్రవేశపెట్టాలని ఇప్పుడు పీటీ వారెంట్‌ కూడా నమోదు చేశారు. ఈ నెల 11లోపు అంబటిని కోర్టులో హాజరు పరచాలని ఆదేశాలు వచ్చాయి. రాంబాబును రేపు కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అంబటి కస్టడీ పిటిషన్లపై కూడా రేపు కోర్టు తీర్పు వెల్లడించనుంది.

Also Read: Fire Accident: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ ఫైల్స్ సేఫ్‌.. ఎలాగంటే?: ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ షికా గోయల్ క్లారిటీ

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. పలు పోలీస్ స్టేషన్లలో తనపై అక్రమంగా కేసులు నమోదు చేశారని, వాటిని కొట్టివేయాలని కోరారు. నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ కేసు క్వాష్ ఇటీవలే ఈ నెల 11కి వాయిదా పడింది. మరో 5 కేసుల్లో క్వాష్ పిటిషన్లపై రేపు తీర్పు రానుంది.