Kesineni Nani vs Kesineni Chinni : కేశినేని బ్రదర్స్ వార్‌లో బిగ్ ట్విస్ట్..

Kesineni Nani vs Kesineni Chinni : విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఫిర్యాదుతో పోలీసులు మాజీ ఎంపీ కేశినేని నానిపై కేసు నమోదు చేశారు.

police registered case against Kesineni Nani following a complaint by TDP MP Kesineni Chinni

Kesineni Nani vs Kesineni Chinni : ఏపీ రాజకీయాల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎంపీ కేశినేని నాని మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం వీరి వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేశినేని నానిపై కేసు నమోదైంది. కేశినేని చిన్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు నానిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పటమట పోలీసులు U/s 204, 351, 352, 353, 356, 61 BNS అండ్ 66, 66(C ),66(D),67,72 IT యాక్ట్ సెక్షన్ల కింద నానిపై కేసులు నమోదు చేశారు.

Also Read : Gold Silver Price Today : వరుసగా రెండోరోజు బిగ్ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

22.04.2025 న ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అక్రమంగా తాను లబ్ధి పొందుతున్నట్లు నాని బహిరంగ లేఖ విడుదల చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కేశినేని చిన్ని పేర్కొన్నారు. బినామీ పేర్లతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నట్లు చేసిన ఆరోపణలపై లీగల్ నోటీసు పంపినప్పటికీ రిప్లై ఇవ్వకపోగా దుష్ప్రచారం చేయడంపై పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.

తాజా పరిణామంతో కేశినేని చిన్ని, నాని మధ్య వార్ తీవ్రరూపం దాల్చింది. ఈ వ్యవహారం భవిష్యత్తులో మరిన్ని రాజకీయ, న్యాయపరమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ కేసులో ఆరోపణలపై తుది నిజానిజాలు దర్యాప్తు అనంతరం మాత్రమే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.