Money In Pastor House: వామ్మో.. ఏపీలోని పాస్టర్ ఇంట్లో నోట్ల కట్టల కలకలం.. ఏకంగా 2 కోట్ల నగదు సీజ్
పాస్టర్, అతడి కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ నగదు ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
- Naveen
- Updated on- April 17, 2026 / 12:52 AM IST
- నరసాపురంలో పాస్టర్ ఇంట్లో కట్టల కట్టల డబ్బు
- 2 కోట్ల 27 లక్షలకు పైగా నగదు సీజ్
- అన్ని కోణాల్లో పోలీసుల దర్యాఫ్తు
Money In Pastor House: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో భారీగా నగదు పట్టుబడింది. ఓ పాస్టర్ ఇంట్లో కట్టల కట్టల డబ్బు దొరికింది. పాస్టర్ ఘంటా జాన్ బాబూరావు ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డబ్బు దొరికింది. ఈ నగదు విలువ 2 కోట్ల 27 లక్షల 94వేల రూపాయలు. ఈ నగదు గురించి పాస్టర్, అతడి కుటుంబసభ్యులను పోలీసులు ప్రశ్నించారు. వారు పొంతన లేని సమాధాలు చెప్పారు. దీంతో పోలీసులు నగదును సీజ్ చేశారు.
పాస్టర్ అల్లుడు శాంసన్ హైదరాబాద్ నుంచి నరసాపురానికి అనధికారికంగా 50 లక్షల రూపాయల నగదు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. శాంసన్ ఇంటికి రాగానే సోదాలు చేశారు. అతడి దగ్గరి నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. పాస్టర్ ఇంట్లోనూ సోదాలు చేశారు పోలీసులు. ఈ క్రమంలో మరింత డబ్బు దొరికింది. పాస్టర్, అతడి కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ నగదు ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read: బీకేర్ ఫుల్.. బయటకు రావొద్దు.. ఏపీలో మరింత మండిపోనున్న ఎండలు
పాస్టర్ అల్లుడు హైదరాబాద్ నుంచి వస్తున్నాడని తెలియగానే పోలీసులు నిఘా పెట్టారు. అతడు రాగానే అతడిని తనిఖీ చేశారు. అతడి దగ్గర 50 లక్షల రూపాయల నగదు లభించింది. ఈ డబ్బుకు సంబంధించిన పాస్టర్ అల్లుడు పోలీసులకు సరైన వివరాలు ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులు పాస్టర్ ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాస్టర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. దాదాపు 2 కోట్ల 27 లక్షలకు పైగా నగదు లభ్యమైంది. మూడు సూట్ కేసుల్లో నగదును గుర్తించారు పోలీసులు.
ఇంత డబ్బు పాస్టర్ కి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత డబ్బు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? అనేది పోలీసులు ఆరా తీశారు. అయితే, పాస్టర్ బాబూరావు సరైన వివరాలు ఇవ్వలేదు. దీంతో పోలీసులు క్యాష్ మొత్తం సీజ్ చేశారు. వెంటనే ఐటీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పాస్టర్ బాబూరావు, ఆయన అల్లుడు ఏమేం వ్యాపారాలు చేస్తున్నారు? ఎటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు? ఇంత డబ్బు వీరికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా అన్ని కోణాల్లో నరసాపురం రూరల్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
