సీఎం జగన్ మాట ఇస్తే తప్పరు : పోలవరం అనుకున్న సమయానికే పూర్తి చేస్తాం 

  • Publish Date - November 1, 2019 / 06:12 AM IST

ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో నూతన శనానికి సీఎం జగన్ ప్రభుత్వం శ్రీకారం చట్టింది. పోలవరం..హైడల్ ప్రాజెక్టు  పనులకు భూమి పూజకు శుక్రవారం (నవంబర్ 1)న జరుగనుంది. మేఘా ఇంజనీరింగ్ సంస్థలు, ప్రభుత్వం ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు సిద్ధమైమయ్యాయి. 

ఈ విషయంపై మంత్రి  అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ..పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రతి పక్షాలు విమర్శలకు చెక్ పెడుతూ..తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇచ్చినట్లే పనులను ఈరోజు నుండే ప్రారంభిస్తున్నామని తెలిపారు. అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో అంతులేని అవినీతికి పాల్పడిందని..అవినీతి డబ్బుతో నేతలు జేములు నింపుకున్నారని మంత్రి ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం జగన్ ప్రభుత్వం నిలిపివేస్తోందని విపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేశాయనీ..కానీ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతాం అని సీఎం జగన్ మాట ఇచ్చారనీ..సీఎం జగన్ మాట ఇస్తే తప్పే మనిషి కాదనీ..ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని అన్నారు.