Andhra Paper Mill: ఆంధ్రా పేపర్ మిల్లుకు షాక్.. రూ.21 కోట్ల భారీ జరిమానా.. పవన్ కళ్యాణ్ మార్క్ యాక్షన్

రాజమహేంద్రవరంలోని ప్రముఖ ఆంధ్రా పేపర్ మిల్లు(Andhra Paper Mill)పై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) కఠిన చర్యలు చేపట్టింది.

Pollution Control Board imposes Rs 21 crore fine on Andhra Paper Mill.

  • ఆంధ్రా మిల్లుకు భారీ జరిమానా
  • రూ.21 కోట్ల పర్యావరణ పరిహారం
  • గోదావరిలో వ్యర్థాల విడుదల నిషేధం

Andhra Paper Mill: రాజమహేంద్రవరంలోని ప్రముఖ ఆంధ్రా పేపర్ మిల్లు(Andhra Paper Mill)పై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) కఠిన చర్యలు చేపట్టింది. పర్యావరణ నిబంధనలను పదేపదే ఉల్లంఘించడమే కాకుండా గోదావరి నదిలోకి కాలుష్య వ్యర్థాలను వదులుతున్నట్లు నిర్ధారించిన పీసీబీ, సదరు పరిశ్రమకు రూ. 21.01 కోట్ల భారీ పర్యావరణ పరిహారాన్ని జరిమానాగా విధించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తూర్పులంక పర్యటన సందర్భంగా గుర్తించిన పర్యావరణ లోపాల ఆధారంగా మే, జూన్ నెలల్లో నోటీసులు జారీ చేసినప్పటికీ పరిశ్రమ తీరు మారలేదు. తగినంత సమయం ఇచ్చినా నిబంధనల ఉల్లంఘన కొనసాగుతుండటంతో పీసీబీ ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది.

AP Municipal Act: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కీలక మార్పులు.. ఇకపై ఈవీఎంలతోనే పోలింగ్.. కొత్త జీవోలు విడుదల

పవన్ కళ్యాణ్ తనిఖీల నుంచి పీసీబీ తనిఖీల వరకు: ఏం జరిగింది?

మే 26న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తూర్పులంక ఇసుక మేటల పరిసరాలను పరిశీలించినప్పుడు వ్యర్థాల పారవేతలో లోపాలు వెలుగుచూశాయి. దీంతో మే 28, జూన్ 12 తేదీల్లో పీసీబీ షోకాజ్ నోటీసులు ఇచ్చి, వ్యర్థాల నిర్వహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. అయితే సెప్టెంబర్ 3న అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లోనూ పరిశ్రమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు స్పష్టమైంది. దీంతో తక్షణ చర్యగా రూ. 21.01 కోట్ల పెనాల్టీ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

గోదావరి పరిరక్షణే ధ్యేయం.. నిబంధనలు అతిక్రమిస్తే సహించేది లేదు:

జీవనది గోదావరితో పాటు పరిసర ప్రాంతాల్లోకి పరిశ్రమల రసాయన వ్యర్థాలను విడుదల చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే ఏ పరిశ్రమపైనైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రాబోయే రోజుల్లో కూడా తనిఖీలను ఉధృతం చేసి, నిబంధనలు పాటించని పరిశ్రమలపై చట్టపరమైన చర్యలు కొనసాగిస్తామని అధికారులు తేల్చిచెప్పారు.