AP Bus Catches Fire : ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ప్రయాణికుల్లో ఓ MLA.. డ్రైవర్ చేసిన పనితో..!
AP Bus Catches Fire : విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి.. పూర్తిగా తగలబడిపోయింది.
- Dharani Pilli
- Published On : March 21, 2026 / 07:43 AM IST
Private travels bus catches fire in vizianagaram
AP Bus Catches Fire : విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పెను ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. ఈ సంఘటన రామభద్రపురం మండలం తారాపురం వద్ద వెలుగుచూసింది. భువనేశ్వర్ నుంచి మల్కాజిగిరి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు వెనుక టైర్ పేలి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
అయితే ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్.. వెంటనే దీని గురించి ప్రయాణికులను అలర్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగిపోయారు. ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తం చేయడంతో వారంతా వెంటనే కిందకు దిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే బస్సు మాత్రం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
