Ap Congress
AP Congress : ఏపీ కాంగ్రెస్‌లో సరికొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ. ఏపీ కాంగ్రెస్ బలోపేతంపై దృష్టిసారించిన రాహుల్ గాంధీ…2021, ఆగస్టు 11వ తేదీ బుధవారం రాష్ట్ర నేతలతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో విడివిడిగా సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ విజ్ఞప్తి, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఉమెన్‌చాందీ సూచనలతో మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ ఎంపీ హర్షకుమార్‌తో మాట్లాడనున్నారు. పీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డితో ఫోన్‌లో మాట్లాడనున్నారు. మొత్తానికి నేతల అభిప్రాయాలు తెలుసుకున్నాక పార్టీలో కీలక పదవులు సైతం ఇచ్చే ఆలోచన చేస్తున్నారట.
Read More : Huzurabad Bypoll : అభ్యర్థిని ప్రకటించనున్న టీఆర్ఎస్..గెల్లు శ్రీనివాస్ ఎవరు ?
ఢిల్లీలో నేతల మకాం : –
రాహుల్ గాంధీతో సమావేశమైన ఉమెన్ చాందీ…ఏపీలో పార్టీ డీలాపడడానికి కారణాలు, బలపేతానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. దీంతో ఆఘమేఘాలపై ఢిల్లీకి రావాలంటూ కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర నేతలను ఆహ్వానించింది. 10 రోజులుగా డిల్లీలోనే మకాం వేసిన ఉమెన్ చాంది…, కెవీపీ, కిరణ్ కుమార్ రెడ్డి, పల్లం రాజు, శైలజానాధ్, హర్షకుమార్‌తో సమావేశమై చర్చించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా నేరుగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. తెలంగాణలో ఇప్పటికే ప్రక్షాళన దిశగా అడుగులు వేసిన ఏఐసీసీ.., ఇప్పుడు ఎపిసిసిలో సమూల మార్పులకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు సమావేశం కీలకం కానుంది.
Read More : TelangAdd Newana : దళితబంధు, మొత్తం 30 పథకాలు..పూర్తి వివరాలు
ఏఐసీసీలో పదవులు : –
కాంగ్రెస్‌లో కీలక పదవులు అనుభవించిన నేతలు కొంతమంది పార్టీకి దూరమవ్వడం మరికొంతమంది పార్టిలోనే ఉన్నా కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం వంటివి ఏఐసీసీ దృష్టికి వెళ్లాయి. పదవులు అనుభవించి ఎందుకు పార్టీ కోసం పపనిచేయడం లేదని రాహుల్ ఆరా తీయడంతో ఉన్నవారందరినీ హుటాహుటిన ఢిల్లీ రావాలని అదేశించడంతో ఏపీ కాంగ్రెస్ నేతలు డీల్లీలో తేలారు. అయితే వీరిపై పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పార్టీ ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా నేతలు సపోర్ట్ చేయకుండా దూరంగా ఉన్నారని అలాంటి వారితో చర్చించి ఏఐసీసీ లో పదవులిస్తే.., ఏపీలో తానేంటో చుపిస్తానని చెప్పినట్లు సమాచారం.
కేవీపీ, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరాకు ఏఐసీసీలో స్థానం కల్పిస్తే ఏపీ కాంగ్రెస్‌లో యాక్టివ్ రోల్ పోషిస్తారని తద్వారా వారి క్యాడర్‌లో జోష్ నెలకొంటుందని చెప్పారట. దీనిని పరిగణనలోకి తీసుకున్న రాహుల్‌గాంధీ…ఢిల్లీలో ఒక్కొక్కరితో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. మరి రాహుల్ గాంధీ చేపట్టే చర్యలు ఏపీలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందా ? లేదా అనేది చూడాలి.