Huzurabad Bypoll : అభ్యర్థిని ప్రకటించనున్న టీఆర్ఎస్..గెల్లు శ్రీనివాస్ ఎవరు ?

హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించనుంది టీఆర్ఎస్‌ పార్టీ. టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పేరును ప్రకటించే అవకాశం ఉందని గులాబీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. దాదాపుగా గెల్లు పేరును కేసీఆర్‌ ఖాయం చేశారని తెలుస్తోంది.

Huzurabad Bypoll : అభ్యర్థిని ప్రకటించనున్న టీఆర్ఎస్..గెల్లు శ్రీనివాస్ ఎవరు ?

Huzurabad

Huzurabad TRS : హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించనుంది టీఆర్ఎస్‌ పార్టీ. టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పేరును ప్రకటించే అవకాశం ఉందని గులాబీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. దాదాపుగా గెల్లు పేరును కేసీఆర్‌ ఖాయం చేశారని తెలుస్తోంది. అయితే అధికారికంగా పేరు ప్రకటించడం లాంఛనం కానుంది. ఉదయం 10 గంటలకు కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం జరగనున్న సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. మంచిరోజు కావడంతో సమావేశం ముగిశాక అభ్యర్థిని ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉంది. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించాక రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చెయ్యాలని..టీఆర్‌ఎస్‌వి నేతలకు ఇప్పటికే సమాచారం వెళ్లింది.

Read More : Supreme Court: ఎనిమిది రాజకీయ పార్టీలకు జరిమానా విధించిన సుప్రీంకోర్టు

ఈటల రాజీనామా : 
కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ అయ్యాక ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఈటలకు ధీటైన అభ్యర్థి కోసం విస్తృతంగా గులాబీ నాయకత్వం అన్వేషించిన తరుణంలో…పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, స్వర్గం రవి, వీరేశం, వకుళాభరణం కృష్ణమోహన్‌తో పాటు కాంగ్రెస్‌ను వీడిని టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డి పేరు కూడా వినిపించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా కౌశిక్‌రెడ్డికి గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించారు కేసీఆర్‌. మిగతావారిలో గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ వైపే గులాబీ దళపతి మొగ్గుచూపినట్లు విశ్వసనీయ సమాచారం.

Read More :Google : వర్క్ ఫ్రమ్ హోమ్..షాకింగ్ న్యూస్

బీసీ నేతగా..విద్యార్థి నేతగా : 
వీణవంక మండలం హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌.. బీసీ నేతగా, విద్యార్థి నేతగా, తెలంగాణ ఉద్యమకారుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. బీసీ నేతగా ఈటల రాజేందర్‌ ప్రజల్లోకి వెళ్తుండడంతో ఆయనకు చెక్‌ పెట్టేందుకు బీసీ నేత గెల్లును ప్రయోగించాలని టీఆర్‌ఎస్‌ చూస్తోంది. ఉద్యమం సమయం నుంచే టీఆర్‌ఎస్‌వీలో క్రియాశీలకంగా వ్యవహరించిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ది హుజూరాబాద్‌ నియోజకవర్గం కావడం ఒక ప్లస్‌ పాయింట్ అయితే ఉన్నత విద్యావంతుడు కావడంతో మరో అర్హతగా మారింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో..విద్యార్థి దశ నుంచే బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ గుర్తింపు దక్కించుకున్నారు గెల్లు శ్రీనివాస్‌. తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్‌ఎస్‌వి తరపున ఉద్యమానికి నాయకత్వం వహించారు.