AP Weather Today : ఏపీ ప్రజలకు అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ..
AP Weather Today : రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి విస్తరించిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.
- Harish Thanniru
- Updated on- June 22, 2026 / 06:55 AM IST
Meteorological Department has forecast rain in several districts of Andhra Pradesh today
- ఏపీ ప్రజలకు అలర్ట్..
- నేడు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ
AP Weather Today : ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం పలు జిల్లాల్లో వానలు దంచికొట్టాయి. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. ఒకవైపు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండగా.. మరోవైపు రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో నేడు (సోమవారం) ఏపీలో మేఘావృత వాతావరణం ఉండే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Also Read : Occult Rituals In School: కర్నూలు జిల్లాలో కలకలం.. బడి ఆవరణంలో క్షుద్ర పూజలు.. భయాందోళనలో విద్యార్థులు
నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
పిడుగులతో కూడిన వర్షాలతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఆ సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద ఉండొద్దని, భారీ హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల వద్ద ఉండొద్దని హెచ్చరించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున అవసరమైతేనే బయటకు రావాలని, వర్షాల సమయంలో జాగ్రత్తలు పాటించి ప్రాణ నష్టం నివారించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రజలు వాతావరణ పరిస్థితులపై తాజా సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వర్షాలు, పిడుగుల నేపథ్యంలో రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
