Ram Gopal Varma : పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా.. ఆర్జీవీ సంచలన ట్వీట్..!
త్వరలో ఏపీలో జరుగబోయే ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. తాజాగా ట్విట్టర్ (X) వేదికగా ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
- Sreehari A
- Updated on- March 14, 2024 / 05:12 PM IST
Ram Gopal Varma to contest against Pawan Kalyan from Pithapuram in Andhr Pradesh
Ram Gopal Varma : ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. త్వరలో ఏపీలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ (X) వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పిఠాపురం నుంచి బరిలో దిగనున్నట్టు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. పవన్ ప్రకటించిన వెంటనే ఆర్జీవీ తాను కూడా పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తిని రేకిత్తిస్తోంది.
ఆర్జీవీ ట్వీట్ వైరల్.. :
‘సడన్‌గా తీసుకున్న నిర్ణయం.. పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను. ఎన్నికల బరిలో దిగబోతున్నాననే విషయం చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇంతకీ, ఆర్జీవీ ఈ ట్వీట్ ఎందుకు చేశారు అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఆర్జీవీ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
ఆర్జీవీ పవన్‌పై సెటైరికల్‌గా ట్వీట్ చేశారా? లేదా పవన్‌కు పోటీగా నిజంగానే ఆర్జీవీ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారా? అని సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్మ ట్వీట్ వెనుక అర్ధం ఏంటి అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
