అసలేం జరిగింది : రాజధాని మార్పు ప్రకటన వాయిదాకు కారణం అదేనా..?

రాజధాని మార్పు ప్రకటనపై జగన్ సర్కార్ వెనక్కి తగ్గిందా..? కేబినెట్ భేటీ తర్వాత... కుండ బద్దలు కొట్టేస్తుంది అని అంతా అనుకున్నా... హఠాత్తుగా కమిటీని తెరపైకి ఎందుకు

  • Publish Date - December 28, 2019 / 02:05 AM IST

రాజధాని మార్పు ప్రకటనపై జగన్ సర్కార్ వెనక్కి తగ్గిందా..? కేబినెట్ భేటీ తర్వాత… కుండ బద్దలు కొట్టేస్తుంది అని అంతా అనుకున్నా… హఠాత్తుగా కమిటీని తెరపైకి ఎందుకు

రాజధాని మార్పు ప్రకటనపై జగన్ సర్కార్ వెనక్కి తగ్గిందా..? కేబినెట్ భేటీ తర్వాత… కుండ బద్దలు కొట్టేస్తుంది అని అంతా అనుకున్నా… హఠాత్తుగా కమిటీని తెరపైకి ఎందుకు తెచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని మార్పుపై ప్రకటన మంచిది కాదని ఏపీ సర్కార్ భావించిందా.. లేక న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయాని ఆలోచించిందా…ఇవేవీ కాకుండా… రైతుల ఆందోళనతో స్పీడ్‌ తగ్గిందా… 

రాజధాని మార్పుపై ఇన్నాళ్లూ ఫుల్ క్లారిటీతో ఉన్న ప్రభుత్వ పెద్దలు.. ఒక్కసారిగా రూటు మార్చేశారు. రాజధాని మార్పుపై కేబినెట్ సమావేశంలో కూలంకుషంగా చర్చించి తేల్చేస్తాం అంటూ ఉదరగొట్టిన మంత్రులు.. భేటీ అనంతరం… మాట మార్చేశారు. మూడు రాజధానుల వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది. ఏ ఏ ప్రాంతాల వారికి లాభం కలుగుతుంది. ప్రభుత్వం ఏమనుకుంటుందనే విషయంపై తుది ప్రకటన వస్తుందనుకుంటున్న సమయంలో… హై పవర్ కమిటీ పేరుతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది జగన్ సర్కార్. 

వాస్తవంగా కేబినెట్ భేటీలో రాజధానిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అమరావతిలో నిర్మించడానికి అయ్యే ఖర్చు ప్రభుత్వానికి భారంగా మారుతుంది కాబట్టి… విశాఖకు రాజధాని మారుస్తున్నామంటూ సీఎం జగన్ మంత్రులకు చెప్పారు. అయితే.. భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో… రాజధానిపై అంత త్వరగా ప్రకటన చేయకుండా… వేచి చూడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జీఎన్ రావు కమిటీ రిపోర్టు తో పాటు.. బోస్టన్ గ్రూప్ నివేదిక వచ్చిన తరువాత రెండింటిని అధ్యయనం చేసి రాజధానిపై నిర్ణయం తీసుకోవడానికి హై పవర్ కమిటిని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. 

మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎంపీలంతా రాజధానిపై ప్రకటన వస్తుందనే ఊరించారు. కానీ… రాత్రికి రాత్రే రాజధాని మార్పు ప్రకటనపై ప్రభుత్వం వెనక్కి వెళ్ళింది అని పరిస్థితులు గమణిస్తున్న విశ్లేషకులు భావిస్తున్నారు. జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ ప్రకారం ప్రతిపాదనలకు కేబినెట్‌లో ఆమోద ముద్ర వేసి… ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే… జీఎన్ రావు కమిటీకి చట్టబద్ధత లేకపోవడం, బోస్టన్ గ్రూప్ కూడా ప్రైవేటు సంస్థ కావడంతో వీటి ఆధారంగా మార్పు ప్రకటన చేస్తే చట్టపరమైన చిక్కులు వస్తాయని ప్రభుత్వం భావించింది. దీంతో.. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకుగాను… హైపవర్ కమిటీ వేసింది ప్రభుత్వం.. కమిటీ ద్వారా ఫైనల్ చేసి అసెంబ్లీలో ఆమోదించాలని డిసైడ్ అయ్యారు…

అటు రైతుల ఆందోళన కూడా స్పష్టమైన ప్రకటన రాకపోవడానికి కారణంగా కనిపిస్తోంది. పది రోజులుగా రైతులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో… రాజధాని విషయంలో తొందరపడకుండా… సమయం తీసుకోవాలని సీఎం జగన్ భావించినట్లు తెలుస్తోంది.