Nellore : పెన్నానది బ్రిడ్జిపై రాకపోకలు బంద్, రిపేర్ చేస్తారా ? కొత్తది కడుతారా ?

డప జిల్లా జమ్మలమడుగులో పెన్నా నదిపై 2008లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వంలో నిర్మించారు. 13 ఏళ్లకే బ్రిడ్జి కుంగిపోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

Penna river in Nellore : భారీ వర్షాలు, వరదలతో కడప జిల్లా జమ్మలమడుగులో పెన్నానదిపై నిర్మించిన బ్రిడ్జి ఒకచోట కుంగిపోయింది. దీంతో బ్రిడ్జిపై నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు అధికారులు. ప్రమాదకరంగా కూలిపోయే పరిస్థితిలో ఉండటంతో బ్రిడ్జి రిపేరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. పెన్నా నది పరిసర ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు కొనసాగించాలని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు.

Read More : Stock Market : మరో బ్లాక్ డే…స్టాక్ మార్కెట్లు భారీ పతనం, లక్షల కోట్ల సంపద ఆవిరి

కడప జిల్లా జమ్మలమడుగులో పెన్నా నదిపై 2008లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వంలో నిర్మించారు. హుబ్లీ-కృష్ణపట్నం జాతీయ రహదారిపై 675 మీటర్ల పొడవుతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ముద్దనూరు, పులివెందుల, తాడిపత్రి, అనంతపురం వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. ఈ నెల 19, 20 తేదీల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 1.60లక్షల క్యూసెక్కుల నీటిని పెన్నాకు విడుదల చేశారు. దీంతో 16వ పిల్లర్ వద్ద బ్రిడ్జి కుంగిపోయింది. 13 ఏళ్లకే బ్రిడ్జి కుంగిపోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

Read More : తిరుపతిలో వింత ఘటన.. ట్యాంక్ భూమిపైకి ఎలా వచ్చిందబ్బా..?

బ్రిడ్జి కింద అక్రమ ఇసుక రవాణా జరగడమా ?, నాణ్యతా లోపమా ? ఒక్కసారిగా వరద నీరు రావడమే కారణమా ? అనే దానిపై స్పష్టత రావడం లేదు. బ్రిడ్జి  నేషనల్‌ హైవేస్‌ పరిధిలో ఉండటంతో కుంగిన చోట మాత్రమే రిపేర్ చేస్తారా లేక, కొత్త బ్రిడ్జి నిర్మిస్తారా అనేది తెలియాల్సి ఉంది. వర్షాలు తగ్గినా వరద ప్రవాహం తగ్గకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. గండికోట జలాశయం నుంచి మైలవరం వరకు ప్రతీరోజు 15వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో మైలవరం నుంచి పెన్నాకు కూడా అదేస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో వరద ప్రవాహం తగ్గి, బ్రిడ్జిని పునరుద్ధరించే వరకు చుట్టుపక్కల 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు