Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొట్టిన తుఫాను వాహనం

Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లాలోని మాచర్ల నగరవనం వద్ద ఆగిఉన్న లారీని తుఫాను వాహనం ఢీకొట్టింది.

Road Accident

Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లాలోని మాచర్ల నగరవనం వద్ద ఆగిఉన్న లారీని తుఫాను వాహనం వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : Three CM’s : ముగ్గురు సీఎంలు ఒకే వేదికపై.. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్.. ఫొటోలు వైరల్..

వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో పలువురు తుఫాను వాహనంలో ఇరుక్కుపోయారు. స్థానికులు, పోలీసులు ఘటన స్థలికి చేరుకొని వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మాచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. బంధువులు మృతి చెందడంతో వాహనంలో పామూరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం.