Nellore Rottela Panduga: నెల్లూరు రొట్టెల పండుగ తేదీలు ఖరారు.. స్వర్ణాల చెరువు వద్ద భారీ ఏర్పాట్లు.

బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ(Nellore Rottela Panduga) తేదీలను అధికారులు, మత పెద్దలు ఆదివారం అధికారికంగా ప్రకటించారు.

rottela panduga 2026 dates swarnala cheruvu nellore arrangements started

  • నెల్లూరు రొట్టెల పండుగ తేదీలు ఖరారు.
  • స్వర్ణాల చెరువు వద్ద భారీ ఏర్పాట్లు.
  • భక్తులకు మౌలిక వసతుల కల్పన.

Nellore Rottela Panduga: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరులోని సుప్రసిద్ధ బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ తేదీలను అధికారులు, మత పెద్దలు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ ఉత్సవాలు ఈనెల 16వ తేదీన నిషాన్ (దర్గా వద్ద జెండా ప్రతిష్ఠ) కార్యక్రమంతో ప్రారంభం కానున్నాయి. అనంతరం ఈనెల 26న చందల్ మౌలి, 27న బారా షహీద్‌ల గంథ మహోత్సవం, 28న అత్యంత ప్రధానమైన రొట్టెల పండుగ, 29న తహలీల్ పాతేహా (ప్రత్యేక దువాలు) నిర్వహించి, జూన్ 30న జరిగే ముగింపు సభతో ఈ వేడుకలు పూర్తికానున్నాయి.

Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో ఘోర భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రత.. 10 అడుగుల ఎత్తున సునామీ హెచ్చరిక

రొట్టెల పండుగను పురస్కరించుకుని నెల్లూరు నగర పాలక సంస్థ (NMC) ఆధ్వర్యంలో స్వర్ణాల చెరువు సమీపంలో భక్తుల కోసం ముందస్తు ఏర్పాట్లు శరవేగంగా ప్రారంభమయ్యాయి. చెరువు పరిసరాల్లో టైల్స్ పనులు, గుర్రపుడెక్క తొలగింపు, తాత్కాలిక షెడ్ల నిర్మాణం మరియు టాయిలెట్ల మరమ్మతు పనులను ఆదివారం నాడు అధికారులు ప్రారంభించారు. ఎన్ఎంసీ ఏఈ ఫజిల్‌తో కలిసి టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి పఠాన్ సాబీర్ ఖాన్ ఈ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా సాబీర్ ఖాన్ మాట్లాడుతూ, ఈ ఏడాది రొట్టెల పండుగకు(Nellore Rottela Panduga) దేశవిదేశాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం నాణ్యమైన ఏర్పాట్లు చేయాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు. వారి మార్గదర్శకాలకు అనుగుణంగానే పనులను వేగవంతం చేశామని, వసతుల కల్పనలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.