Sajjala Rama Krishna Reddy : పవన్ కళ్యాణ్ పగలు ఒక పార్టీతో.. రాత్రికి ఇంకో పార్టీతో తిరుగుతారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ పై సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Sajjala Slams Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ పై సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ పగలు ఒక పార్టీ, రాత్రి ఒక పార్టీతో తిరుగుతున్నారని విమర్శించారు.

పవన్ కు సొంత అభిప్రాయమంటూ ఏమీ లేదని ఎద్దేవా చేశారు. పూటకో మాట చెబుతుంటారని ఆరోపించారు. పవన్ కు ఆవేశం తప్ప ఆలోచన లేదన్నారు.

ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. అందుకే ప్రజల్లో జగన్ కు ఆదరణ పెరుగుతుందన్నారు. వైసీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే తమపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు