×
Ad

Sankranti Cockfighting : కోడి పందాల్లో కళ్లు చెదిరే బహుమతులు.. కార్లు, బైక్‌లు సహా.. బుల్లెట్ బైక్ గెలుచుకున్న ఎమ్మెల్యే

Sankranti Cockfights : ఏపీలో చాలా ప్రాంతాల్లో కోళ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి. అయితే, ఈసారి పలు ప్రాంతాల్లో వినూత్నరీతిలో నిర్వాహకులు కోడి పందాలను నిర్వహిస్తున్నారు.. తద్వారా విజేతలకు ఖరీదైన బహుమతులు అందజేస్తున్నారు.

Sankranti Cockfighting

  • ఏపీలో జోరుగా కోడి పందాలు
  • పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో వినూత్నరీతిలో నిర్వహణ
  • బుల్లెట్ బైక్ గెలచుకున్న బాపట్ల ఎమ్మెల్యే

Sankranti Cockfighting : తెలుగు ప్రజల ముఖ్యమైన పండుగల్లో ఒకటైన పండుగ సంక్రాంతి. ఏపీలో సంక్రాంతి పండుగను సంబురంగా జరుపుకుంటున్నారు. మరోవైపు.. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో కోళ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి. పందెం వీరులు బరిలోకి దిగి వేలు, లక్షల్లో డబ్బులు జల్లుతున్నారు.

Also Read : Pentagon Pizza Theory : పెంటగాన్‌లో పిజ్జా ఆర్డర్లు పెరిగాయ్.. ఇరాన్‌పై అమెరికా దాడికి సిద్ధమైందా..! ఏంటీ ‘పెంటగాన్‌ పిజ్జా థియరీ’?

ఏపీలో చాలా ప్రాంతాల్లో కోళ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ కోడి పందాలలో వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. పురుషులతో పాటు మహిళలుసైతం ఈ కోడి పందాలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక కోడి పందాలను చూడటంకోసం తెలంగాణసహా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తుంటారు. పలు ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలోనే కోడి పందాలు జరుగుతున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో ఈసారి కోడి పందాలను వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు. కొందరు నిర్వాహకులు టోర్నమెంట్ మాదిరిగా వీటిని ఏర్పాటు చేశారు. బెట్టింగ్ లు లేకుండా ఎవరైతే గెలుస్తారో ఆ విజేతలకు ఖరీదైన బహుమతులు అందిస్తున్నారు. మూడ్రోజులు పందాల్లో చివరి రోజు విజేతలకు బైకులు, కార్లు ఇతర వాహనాలను బహుమతులుగా అందజేస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో టోర్నమెంట్ మాదిరిగా ఈసారి కోడి పందాలను నిర్వహించారు. బెట్టింగ్ లు లేకుండా మూడ్రోజుల పాటు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. చివరి రోజు విజేతకు మహీంద్రా థార్, రెండోరోజు విజేతకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ బహుమతిగా ఇస్తున్నారు. ఈ కోడి పందాల్లో ఎవరూ ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు చెప్పారు.

మరోవైపు.. బాపట్ల జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలోని పిట్టలవానిపాలెం మండలంలో జరిగిన కోడి పందాల్లో స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ విజేతగా నిలిచారు. దీంతో ఆయన బుల్లెట్ బైక్ ను బహుమతిగా గెలుచుకున్నారు. పదిసార్లు పందాలలో ఆయన వరుసగా ఆరు సార్లు విజయం సాధించి బుల్లెట్ బైక్ సొంతం చేసుకున్నారు.