Pentagon Pizza Theory : పెంటగాన్‌లో పిజ్జా ఆర్డర్లు పెరిగాయ్.. ఇరాన్‌పై అమెరికా దాడికి సిద్ధమైందా..! ఏంటీ ‘పెంటగాన్ పిజ్జా థియరీ’?
Pentagon Pizza Theory : అమెరికా సైనిక ఆపరేషన్ల సమయంలో పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా డెలివరీలు అమాంతం పెరుగుతాయనేది కొన్నేళ్లుగా వినిపిస్తోన్న వాదన.
Pentagon Pizza Theory
- పెంటగాన్‌లో పిజ్జా ఆర్డర్లు పెరిగాయ్
- ఇరాన్ పై అమెరికా దాడి చేస్తుందని ఊహాగానాలు
- పిజ్జా సేల్స్ పెరిగితే యుద్ధానికి సంకేతమా..!
- అసలేంటీ ‘పెంటగాన్ పిజ్జా థియరీ’?
Pentagon Pizza Theory : పెంటగాన్‌లో పిజ్జా ఆర్డర్లు పెరుగుదలతో ఇరాన్ పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందనే ఊహాగానాలకు దారితీస్తుంది. ఉధ్రిక్తతల పెరగడం, ఈ వారం మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నందున “పెంటగాన్ పిజ్జా ఇండెక్స్” సిద్ధాంతం మళ్లీ తెరపైకి వచ్చింది.
Also Read : Palak Paneer: వెరీ ఇంట్రస్టింగ్.. పాలక్ పన్నీర్ వాసనతో కోటి రూపాయలు గెలుచుకున్న భారతీయ విద్యార్థులు
పెంటగాన్ పిజ్జా నివేదిక ప్రకారం.. వర్జీనియాలోని ఆర్లింగ్టన్‌లోని యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయానికి దగ్గరగా ఉన్న అనేక పిజ్జా సెంటర్ల నుంచి ఇటీవల గంటల్లో సగటు కంటే ఎక్కువగా ఫిజ్జాలు విక్రయాలు జరిగాయని తెలిపింది. పెంటగాన్ పిజ్జా ఇండెక్స్ లేదా పిజ్జా సిద్ధాంతం దశాబ్దాలుగా ప్రచారంలో ఉంది. ప్రధాన యూఎస్ రక్షణ భవనాల దగ్గర పిజ్జా డెలివరీలలో పెరుగుదల కొన్నిసార్లు సైనిక, జాతీయ భద్రతా సిబ్బంది అర్ధరాత్రి దాడులకు సంకేతంగా భావిస్తుంటారు.
అమెరికా సైనిక ఆపరేషన్ల సమయంలో పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా డెలివరీలు అమాంతం పెరుగుతాయనేది కొన్నేళ్లుగా వినిపిస్తోన్న వాదన. 2025 జూన్ నెలలో పెద్దెత్తున మధ్యప్రాచ్య దాడులకు కొంతకాలం ముందు పెంటగాన్ సమీపంలోని బహుళ అవుట్‌లెట్‌లు కార్యకలాపాలలో భారీ ఫిజ్జా ఆర్డర్ల పెరుగుదలను నమోదు చేశాయి. ఆ తరువాత కొద్ది గంటల్లోనే టెహ్రాన్‌లో అంతర్జాతీయ దాడులు జరిగినట్లు నివేదించబడ్డాయి. ఇటీవల వెనెజువెలాపై అమెరికా బలగాలు అనూహ్య దాడి చేయడంకు ముందు అమెరికా రక్షణ కార్యాలయం సమీపంలో పిజ్జా అవుట్‌లెట్లకు ఒక్కసారిగా ఆర్డర్లు పెరిగాయి. దీంతో పెంటగాన్ పిజ్జా థియరీ మరోసారి చర్చనీయాంశమైంది. అయితే, ఈ పిజ్జా సిద్ధాంతంను కొందరు కొట్టిపారేస్తున్నారు.
ఖమేనీ ప్రభుత్వం హింసాత్మక మార్గాల ద్వారా నిరసనలను అణచివేయడానికి ప్రయత్నిస్తే దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హచ్చరించిన విషయం తెలిసింది. దీంతో ఇటీవల కాలంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. నిరసనలు కొనసాగించాలని, ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని ఇరాన్ నిరసనకారులకు ట్రంప్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పోరాటం చేసేవారికి సాయం అందిస్తామని పేర్కొంటూ ట్రంప్ సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ లో పోస్టు పెట్టారు. ఇదే సమయంలో అమెరికన్లు వీలైనంత త్వరగా ఇరాన్‌ను విడిచి వెళ్లాలని అమెరికా కూడా ఒక సలహా జారీ చేసింది.
అయితే, ఈ ఫిజ్జా థియరీ ట్రెండ్ ఈ మధ్యకాలంలో వచ్చింది కాదు. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలోనే ఈ థియరీ వెలుగులోకి వచ్చింది. అప్పట్లో అమెరికా సైనికాధికారుల కదలికలను గమనించేందుకు అగ్రరాజ్య ప్రభుత్వ భవనాల సమీపంలో వచ్చిన పిజ్జా ఆర్డర్లును సమీక్షించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
