×
Ad

Andhrapradesh : ఏపీలో దారుణ ఘటన.. భార్యను లేపుకెళ్లాడని.. పోలీస్ స్టేషన్ గేటు ముందే నరికి..

Sathya Sai district : ఏపీలోని సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకల్లు పోలీస్ స్టేషన్ గేటు ఎదుటే ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిపై వేట కొడవళ్లతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు.

Thanakallu Police Station

  • ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో దారుణ ఘటన
  • తన భార్యను లేపుకెళ్లిన వ్యక్తిని అన్నతో కలిసి హత్యచేసిన భర్త
  • తనకల్లు పోలీస్ స్టేషన్ గేటు ఎదుటే వేట కొడవలితో దాడిచేసి హత్య

Sri Sathya Sai district : ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకల్లు పోలీస్ స్టేషన్ గేటు ఎదుటే ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిపై వేట కొడవళ్లతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : Gold and Silver Rates Today : గోల్డ్‌ లవర్స్‌కి షాకింగ్ న్యూస్.. వెండి వేగంగా..! నేటి బంగారం, వెండి ధరలు ఇవే..

ఏపీలోని సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాగినేపల్లికి చెందిన ఈశ్వరప్ప అనే వ్యక్తిపై అన్నదమ్ములు హరి, చిన్నప్ప వేటకొడవళ్లతో దాడి చేశారు. తనకల్లు మండల పోలీస్ స్టేషన్ గేటు ఎదుటే అతన్ని నరికి దారుణ హత్యకు పాల్పడ్డారు. మహిళతో అక్రమ సంబంధమే ఈశ్వరప్ప హత్యకు కారణంగా చెబుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరి భార్యతో ఈశ్వరప్ప అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం హరి భార్యను ఈశ్వరప్ప తీసుకెళ్లిపోయాడు. భార్య కనపడటం లేదని హరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. హరి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.

పోలీసులు ఈశ్వరప్ప, హరి భార్యకోసం వెతుకులాట ప్రారంభించగా.. నెల్లూరులో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో నెల్లూరులో ఉంటున్న ఈశ్వరప్పతో పాటు హరి భార్యను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున తనకల్లు పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న హరి, వాళ్లఅన్న చిన్నప్ప ఇద్దరు అర్ధరాత్రి 3గంటల సమయంలో కాపుకాచి ఈశ్వరప్ప ను పోలీస్ స్టేషన్ గేటు ఎదుట వేట కొడవలితో నరికి దారుణంగా హత్య చేశారు. కారు దిగి స్టేషన్లోకి వెళ్తుండగా.. అన్నదమ్ములు ఇద్దరు కొడవళ్లతో దాడి చేసి.. నరికి చంపారు. ఈ ఘటనతో హరి భార్య అక్కడి నుంచి పరారైంది.