Satya Sai District : ఏపీలో విషాదం… ఒకే ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్లు.. నలుగురు మృతి.. పలువురికి గాయాలు

Satya Sai District Cyllinder Blast: ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. సత్యసాయి జిల్లాలోని కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి.

Satya Sai District Gas Cylinder Exploded

  • ఏపీలోని సత్యసాయి జిల్లాలో విషాధ ఘటన
  • గ్యాస్ సలిండర్లు పేలి నలుగురు మృతి
  • 21మందికి గాయాలు.. పలువురి పరిస్థితి విషమం

Satya Sai District : ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. సత్యసాయి జిల్లాలోని కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. 21మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చనిపోయిన వారిలో మహబూబున్ని (40), మధు (36), సంపత్ (30), వెంకన్న (45)గా గుర్తించారు.

Also Read : టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్.. పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలు ప్రకటన

ఇంట్లో నిల్వ ఉంచిన నాలుగు డిటోనేలర్లు పేలి గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు సమయంలో మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయపడి బయటకు పరుగులు తీశారు.