Jr NTR Political Entry: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బిగ్ అప్‌డేట్.. త్వరలోనే భారీ మీటింగ్.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన న్యూస్!
టాలీవుడ్ మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr) కూడా రాజకీయాల వైపు చూస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
- V Santhosh Kumar
- Updated on- July 13, 2026 / 05:19 PM IST
Sensational news regarding Jr. NTR political entry goes viral; massive meeting planned soon.
- పవన్, విజయ్ సంచలన విజయాలు.
- తారక్ రాజకీయ ఎంట్రీ ప్రచారం.
- మీటింగ్‌పై నెలకొన్న తీవ్ర ఉత్కంఠ.
Jr Ntr: భారతీయ చలనచిత్ర రంగానికి, రాజకీయాలకు ఎప్పటి నుంచో విడదీయరాని బంధం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్, తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత వంటి వారు వెండితెరపైనే కాకుండా రాజకీయాల్లోనూ తిరుగులేని చక్రవర్తులుగా వెలిగారు. మరికొందరు స్టార్ హీరోలు కూడా పాలిటిక్స్ లోకి అడుగుపెట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. అయితే, ఇటీవల మారుతున్న రాజకీయ పరిణామాలు గమనిస్తే.. గ్లామర్ ఫీల్డ్ నుంచి పవర్ పాలిటిక్స్ వైపు అడుగులు వేయడం మళ్లీ ఊపందుకుంది.
Also Read – ధవళేశ్వరం బ్యారేజీకి మహర్దశ.. రూ.152 కోట్లతో ఆధునీకరణ.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
విజయ్, పవన్ సంచలనాలు.. కొత్త ఆశలు:
ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి సరికొత్త జోష్ నింపగా, అటు తమిళనాడులో దశాబ్దాల ద్రవిడ రాజకీయాల రికార్డులను తిరగరాస్తూ స్టార్ హీరో విజయ్ (TVK పార్టీ) ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ విజయాలు ప్రస్తుతం ఉన్న మిగతా హీరోలకు కూడా పెద్ద బూస్ట్‌లా మారాయి. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయ ఎంట్రీపై జోరుగా ప్రచారం సాగుతుండగా, అటు తమిళ స్టార్ హీరో ధనుష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏకంగా ఒక అఫీషియల్ జెండాను ఆవిష్కరించడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తారక్ మీటింగ్ వెనుక అసలు కథ?
ఇదే తరుణంలో టాలీవుడ్ మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr) కూడా రాజకీయాల వైపు చూస్తున్నారంటూ, ఆయన త్వరలోనే ఒక భారీ మీటింగ్ పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా, ఎట్టకేలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్పందిస్తూ ఒక అధికారిక క్లారిటీ ఇచ్చింది. జూలై 18న నిర్వహించ తలపెట్టిన ‘మా ఊరు – వాడ’ అనే కార్యక్రమం పూర్తిగా సామాజిక బాధ్యతతో కూడిన సేవా కార్యక్రమమే తప్ప, దానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
టీడీపీనా.. కొత్త ప్రస్థానమా?
తారక్ పొలిటికల్ ఎంట్రీ రూమర్లకు ప్రస్తుతానికి బ్రేక్ పడినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా ఈ చర్చలు అంత సులువుగా ఆగేలా లేవు. భవిష్యత్తులో ఆయన తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ (TDP) బాధ్యతలు అందుకుంటారా, లేదా నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా సరికొత్త పొలిటికల్ జర్నీని ప్రారంభిస్తారా అనేది అభిమానుల్లో మిగిలి ఉన్న మిలియన్ డాలర్ల ప్రశ్న. తారక్ స్వయంగా దీనిపై నోరు విప్పేంతవరకు ఈ రాజకీయ సస్పెన్స్ ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది.
