టీడీపీకి వరుస షాక్‌లు… వైసీపీలో చేరనున్న కరణం బలరాం

ఏపీలో తెలుగుదేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ఆ పార్టీ విలవిల్లాడుతోంది.

  • Publish Date - March 12, 2020 / 02:32 AM IST

ఏపీలో తెలుగుదేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ఆ పార్టీ విలవిల్లాడుతోంది.

ఏపీలో తెలుగుదేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ఆ పార్టీ విలవిల్లాడుతోంది. టీడీపీ నేతలు వరుసపెట్టి వైసీపీలో చేరిపోతున్నారు. ఇప్పుడు ఇదే బాటలో మరో ఎమ్మెల్యే క్యూ కట్టారు. చీరాల ఎమ్మెల్యే టీడీపీకి రాజీనామా చేసి.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

వైసీపీలోకి ఊపందుకున్న వలసలు
స్థానిక సంస్థల ఎన్నికలవేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా వైసీపీలో చేరిపోతున్నారు. దీంతో చంద్రబాబుకు షాక్‌మీద షాక్‌లు తగులుతున్నాయి.  మొన్న డొక్కా మాణిక్య వరప్రసాద్‌, రహమాన్‌, కదిరి బాబూరావు…  నిన్న రామసుబ్బారెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు.. పులివెందులలో జగన్‌పై పోటీ చేసిన సతీష్‌రెడ్డి కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు ఇదే బాటలో మరో టీడీపీ ఎమ్మెల్యే రెడీ అయ్యారు. టీడీపీ ఆయన గుడ్‌బై చెప్పబోతున్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం  టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. 

టీడీపీ వీడనున్న కరణం బలరాం
కరణం బలరాం ఇవాళ టీడీపీకి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ఆయన రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పెద్దలు బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఆయన మెత్తబడలేదు. రాజీనామా చేసిన అనంతరం ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అది ఇవాళ, రేపా అన్నది ఇంకా క్లారిటీ 

టీడీపీపై అసంతృప్తి
గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి కరణం బలరాం ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణ మోహన్‌పై విజయం సాధించారు. అయితే ఆయన కొంతకాలంగా టీడీపీపై అసంతృప్తితో ఉన్నారు. గొట్టిపాటి రవిని టీడీపీలో చేర్చుకున్నప్పటి నుంచి … ఆయన పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. అంతేకాదు.. స్థానికస సంస్థల ఎన్నికలకు కూడా దూరంగా ఉంటున్నారు.

వైసీపీలో చేరడానికి గ్రీన్‌సిగ్నల్‌
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కరణం బలరాం టీడీపీ వీడాలని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన  ఆ జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో చర్చలు జరిపారు. వారితో చర్చలు సఫలం కావడంతో.. ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పాలని డిసైడ్‌ అయ్యారు. 

See Also | భారత్‌లో కరోనా విజృంభణ: సరిహద్దులు, స్కూళ్లు, సినిమాలు బంద్!