ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణపై విధించిన లాక్‌డౌన్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నగరాలు, పట్టణాల్లోని రైతు బజార్లను పెద్ద ఎత్తున వికేంద్రీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకే చోట కాకుండా నగరాలు, పట్టణాల్లో ప్రాంతాల వారీగా కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
అంతేకాదు.. ప్రతి దుకాణం వద్ద సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధి మున్సిపల్ స్టేడియంలోని రైతు బజార్ లో కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక దూరాన్ని చేపట్టింది.
రైతు బజార్ కు వచ్చినవారిందరిని కొన్ని మీటర్ల దూరంగా ఉండేలా క్యూ పద్దతిలో కూరగాయలను అమ్మే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన సామాజిక దూరం కాన్సెప్ట్ చూసిన నెటిజన్లు గవర్నమెంట్ హ్యాట్సాప్ అంటూ ప్రశంసిస్తున్నారు.
See Also | భళా కేరళ.. కరోనా వైరస్ కట్టడి చేసిందిలా