Somu
Somu Veerraju: బీజేపీ నేతలు వరుసగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శలు గుప్పించిన రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇళ్ల మంజూరుపై రాష్ట్ర వైఖరిని ప్రశ్నిస్తూ ధ్వజమెత్తారు.
‘గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో వేతనాలు ఖచ్చితంగా అందడం లేదు. జాబ్ కార్డు హోల్డర్లతో బీజేపీ ఉద్యమం చేయించాల్సిన పరిస్థితి వచ్చిందని’ అన్నారు.
‘కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు ఇళ్లు అయినప్పటికీ.. వాటి నిర్మాణం వేగంగా పూర్తి కావడం లేదు. రూ.3లక్షల కోట్లు కేటాయించి జాతీయ రహదారుల నిర్మాణాన్ని 2024 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన విషయం గుర్తు చేస్తున్నా’మన్నారు.
Read Also : కేంద్రం ఇస్తామన్నా.. ఏపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదు-సోమువీర్రాజు
సహకార చక్కెర కర్మాగారాలు ఎందుకు మూసి వేస్తున్నారు. నదీ ప్రాంతంలో గ్రోయిన్స్ నిర్మాణం ఎందుకు చేయడం లేదు. మైనింగ్ ప్రైవేటు పరం చేస్తున్నారెందుకు. ఆర్టీసీలో వందల సంఖ్యలో ప్రైవేటు బస్సులు ఎందుకు అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు సోము వీర్రాజు.
‘మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి కొన్ని ప్రభుత్వాలు కుళ్లుకుంటున్నాయి. ఇదే తరహాలో విశాఖలో రైల్వే జోన్ పూర్తి చేస్తాం. ఇప్పటికే పోలవరానికి రూ.12వేల కోట్లు ఇచ్చాం’ అని సోము వీర్రాజు వివరించారు.