Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో 2 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..

ఏపీలో ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఏయే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి? వాతావరణ శాఖ ఏం చెప్పింది... తెలుసుకుందాం..

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో 2 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..

AP Rains

Updated On : September 12, 2025 / 7:29 PM IST

Weather Updates: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది 48 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికి అనుబంధంగా ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుందన్నారు.

వీటి ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రానున్న రెండు రోజులు వాతావరణం ఈ విధంగా ఉండే అవకాశం..

శనివారం (13-09-2025)
* ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.
మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్.

ఆదివారం (14-09-2025)
* కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

శుక్రవారం సాయంత్రం 6 గంటల నాటికి మన్యం జిల్లా నవగాంలో 73 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా పాతకొప్పెర్లలో 68 మిల్లీమీటర్లు, మన్యం జిల్లా సీతంపేటలో 59.7 మిల్లీమీటర్లు, విశాఖ జిల్లా భీమునిపట్నంలో 55 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డైందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.

Also Read: ఏపీలో వారికి ప్రతి నెల రూ.4 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. ఫుల్‌ డీటెయిల్స్‌