Pawan Kalyan : ఢిల్లీలో తెలుగు సినిమాపై పవన్ కళ్యాణ్ కామెంట్స్.. ఏపీలో NSD క్యాంపస్..
పవన్ కళ్యాణ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కార్యాలయాన్ని సందర్శించారు. (Pawan Kalyan)

Pawan Kalyan
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీ వెళ్లారు. అలాగే ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ తెలుగు ఎంపీలతో, మంత్రులతో మీట్ అవుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(NSD) కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు.
Also Read : Anushka Shetty : అసలే జనాలకు దూరం.. ‘ఘాటీ’ ఫ్లాప్ తర్వాత అనుష్క డెషిషన్ తో నిరాశలో ఫ్యాన్స్..
అనంతరం మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆర్ట్ లేకపోతే సమాజం విచ్ఛిన్నమవుతుంది. ఆర్ట్స్ సమాజానికి కావాలి. NSD చూస్తే మినీ ఇండియాలా ఉంది. నాకు నటన నేర్పిన సత్యానంద్ గారు NSD గురించి గొప్పగా చెప్పేవారు. ఆటా పాట లేకపోతే సమాజంలో వైలెన్స్ పెరిగిపోతుంది. అందుకే దానికి తగ్గట్టు ట్యాలెంట్ కూడా పెరగాలి. ఇప్పుడు తెలుగు సినిమా గ్లోబల్ కి ఎదిగింది. ఏపీలో NSD క్యాంపస్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. దీని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడతాను. అలాగే NSD వాళ్ళను ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్రానికి ఇన్వైట్ చేస్తాము అని తెలిపారు.