Anushka Shetty : అసలే జనాలకు దూరం.. ‘ఘాటీ’ ఫ్లాప్ తర్వాత అనుష్క డెషిషన్ తో నిరాశలో ఫ్యాన్స్..

ఇటీవల ఘాటీ సినిమా ప్రమోషన్స్ కి అనుష్క బయటకు రాలేదు.(Anushka Shetty)

Anushka Shetty : అసలే జనాలకు దూరం.. ‘ఘాటీ’ ఫ్లాప్ తర్వాత అనుష్క డెషిషన్ తో నిరాశలో ఫ్యాన్స్..

Anushka Shetty

Updated On : September 12, 2025 / 3:38 PM IST

Anushka Shetty : అనుష్క శెట్టి ఒకప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ్ లో ఆల్మోస్ట్ అందరు స్టార్ హీరోయిన్స్ తో పనిచేసి అరుంధతి, భాగమతి లాంటి సినిమాలతో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించింది. హీరోలతో సంబంధం లేకుండా అనుష్క ఉంటే చాలు థియేటర్ కి వెళ్లొచ్చు అనేలా ప్రేక్షకులను తన సినిమాలకు రప్పించుకుంది. కానీ ఏమైందో ఏమో బాహుబలి, భాగమతి సినిమా తర్వాత ఒక్కసారిగా సినీ పరిశ్రమకు దూరమయింది.(Anushka Shetty)

ఆ తర్వాత అడపాదడపా ఎప్పుడో ఒకసారి సినిమాలు చేస్తుంది. సినీ పరిశ్రమకు దూరంగా ఉంటే పర్లేదు కానీ జనాలకు కూడా దూరంగా ఉంటుంది. అసలు ఏ సినీ ఈవెంట్లో, బయట కార్యక్రమాల్లో కనపడట్లేదు. సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నా ఏదో పండగలకు విషెస్ చెప్పడం తప్ప రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండదు అనుష్క. సోషల్ మీడియా యుగంలో స్టార్స్ అంతా యాక్టివ్ గా ఉండి ఫ్యాన్స్ కి, జనాలకు దగ్గరవుతుంటే అనుష్క మాత్రం దూరమవుతుంది. ఈ విషయంలో అనుష్క ఫ్యాన్స్ ఎప్పట్నుంచో నిరాశలో ఉన్నారు. తాజాగా అనుష్క సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Also Read : Mirai Review : ‘మిరాయ్’ మూవీ రివ్యూ.. మ‌రో విజువ‌ల్ వండ‌ర్‌తో తేజ స‌జ్జా

ఇటీవల ఘాటీ అనే సినిమాతో వచ్చింది అనుష్క. ఆ సినిమా డిజాస్టర్ అయింది. అసలు ఆ సినిమా ప్రమోషన్స్ కి అనుష్క బయటకు రాలేదు. కనీసం ఏదైనా ఇంటర్వ్యూలు చేసి రిలీజ్ చేసారంటే అది కూడా లేదు. అసలు ఘాటీ ప్రమోషన్స్ లో ఎక్కడా అనుష్క ఫేస్ కనిపించలేదు. ప్రమోషన్స్ లేకుండా సినిమాలకు జనాలు రాని టైంలో అసలు అనుష్క తన సినిమాకు బయటకు కూడా రాకపోవడం గమనార్హం.

ఘాటీ ఫ్లాప్ తర్వాత అనుష్క తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అనుష్క తన పోస్ట్ లో.. బ్లూ లైట్ నుంచి క్యాండిల్ లైట్ కి వెళ్ళిపోతున్నాను. కొన్నాళ్ళు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. స్క్రోలింగ్ వెనక ఉన్న ప్రపంచంతో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి, మనం ఎక్కడ్నుంచి మొదలుపెట్టామో అక్కడనుంచే స్టార్ట్ చేయడానికి వెళ్తాను. త్వరలో మీ ముందుకు మరిన్ని కథలతో మరింత ప్రేమతో వస్తాను అని తెలిపింది.

Also Read : Kishkindhapuri Review : ‘కిష్కింధపురి’ మూవీ రివ్యూ.. బెల్లంకొండ, అనుపమ ఓ రేంజ్ లో భయపెట్టారుగా..

దీంతో అనుష్క సోషల్ మీడియాకు గ్యాప్ ఇస్తుందని తెలుస్తుంది. ఈ విషయంలో అనుష్క ఫ్యాన్స్ నిరాశ చెందగా అసలు అనుష్క సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంది సోషల్ మీడియా నుంచి వెళ్లిపోవడానికి అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.