Trains cancelled : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ ప్రాంతాల మీదుగా వెళ్లే రైళ్లు రద్దు.. ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ
Trains cancelled : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు పాక్షికంగా రద్దు, దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
- Harish Thanniru
- Published on- June 24, 2026 / 12:17 PM IST
Trains cancelled
Trains cancelled : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్ యార్డు ఆధునీకరణ పనుల దృష్ట్యా విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు పాక్షికంగా రద్దు, దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాగుండా నడిచే రైళ్లను పూర్తిగా రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను పక్షికంగా రద్దు చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మరికొన్ని కీలక రైళ్లను ఇతర మార్గాల్లోకి మళ్లించారు.
Also Read : AP Gold Mine : ఏపీలో గోల్డ్‌మైన్.. బంగారం ధరలు తగ్గుతాయా? అసలు విషయం ఇదే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
పూర్తిగా రద్దయిన రైళ్లు ఇవే..
♦ రైలు నంబర్ 17289 (కాకినాడ టౌన్ – మైసూర్ ఎక్స్‌ప్రెస్): 2026 జూలై 31న ప్రయాణించాల్సిన సర్వీసును రద్దు చేశారు.
♦ రైలు నంబర్ 17290 (మైసూర్ – కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్): 2026 ఆగస్టు 1న ప్రయాణించాల్సిన సర్వీసును రద్దు చేశారు.
♦ రైలు నంబర్ 05074 (లాల్ కువాన్ – కేఎస్‌ఆర్ బెంగళూరు): 2026 ఆగస్టు 1న నడవాల్సిన రైలు రద్దయింది.
♦ రైలు నంబర్ 05073 (కేఎస్‌ఆర్ బెంగళూరు – లాల్ కువాన్): 2026 ఆగస్టు 4న ఈ రైలు రద్దయింది.
♦ రైలు నంబర్ 06509 (కేఎస్‌ఆర్ బెంగళూరు – దానాపూర్): 2026 ఆగస్టు 3న ఈ సర్వీసును రద్దు చేశారు.
♦ రైలు నంబర్ 06510 (దానాపూర్ – కేఎస్‌ఆర్ బెంగళూరు): 2026 ఆగస్టు 5న ఈ సర్వీసును పూర్తిగా రద్దు చేశారు.
పాక్షికంగా రద్దయిన రైళ్లు ఇవే..
♦ 18463 భువనేశ్వర్-కెఆస్ఆర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు). ప్రశాంతి నిలయం వరకే.
♦ 18464 కేఎస్ఆర్ బెంగళూరు-భువనేశ్వర్ (ఆగస్టు 1 నుంచి 3వ తేదీ వరకు). ప్రశాంతి నిలయం నుంచి బయలుదేరుతుంది.
దారి మళ్లింపు రైళ్లు ఇవే..
♦ వయా ఎస్ఎంవీటీ బెంగళూరు, బనస్వాడీ, హెబ్బల్, యశ్వంత్ పూర్, కేఎస్ఆర్ బెంగళూరు మీదుగా వెళ్లే 22817 హౌరా – మైసూర్ రైలు (జులై 3, 10, 17, 24, 31 తేదీల్లో)
♦ 22818 మైసూర్ – హౌరా (జూన్ 28, జులై 5, 12, 19, 26, ఆగస్టు 2)
