Southwest Monsoon: మరో రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి రుతుపవనాలు..

మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ విషయాన్ని తెలిపింది. తొలుత ఏపీలోకి ప్రవేశించే రుతుపవనాలు.. ఆ తరువాత తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Rain

Southwest Monsoon: మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ విషయాన్ని తెలిపింది. తొలుత ఏపీలోకి ప్రవేశించే రుతుపవనాలు.. ఆ తరువాత తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కోస్తా తీరం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి గురువారం తెలంగాణ నుంచి దూరంగా వెళ్లింది. దీంతో రుతుపవనాలు ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు నెలకొన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల ముందుగానే

గోవా, కర్ణాటక, దక్షిణ ఏపీలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే రాయలసీమ జిల్లాల్లోకి ప్రవేశించిన తర్వాత తెలంగాణలోకి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  ఈ నెల 13 వరకు రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గడిచిన 24గంటల్లో తెలంగాణ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కురిసింది.  మరోవైపు ఎండలు దంచికొడుతున్నాయి. గురువారం తెలంగాణలో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువ ఉష్ణొగ్రతలు నమోదయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత రామగుండంలో 42.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత నిజామాబాద్ లో 22.9 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.