AP SSC Corrections 2026: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. కరెక్షన్స్ కి ఇదే చివరి అవకాశం
AP SSC Corrections: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు (SSC Board) ఒక ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది.
- V Santhosh Kumar
- Updated on- July 9, 2026 / 11:05 AM IST
SSC Board given opportunity until July 10 for corrections to the personal details of 10th grade students
- ఏపీ టెన్త్ విద్యార్థులకు లాస్ట్ ఛాన్స్
- ఈనెల పదో తేదీవరకే ఆఖరి అవకాశం
- తప్పుల్లేని ఒరిజినల్ సర్టిఫికెట్ల జారీ
AP SSC Corrections: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు (SSC Board) ఒక ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థుల మార్క్స్ మెమోలు, ఒరిజినల్ సర్టిఫికెట్లలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉండేందుకు బోర్డు ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. తమ వ్యక్తిగత వివరాలలో పొరపాట్లను సరిచేసుకోవడానికి విద్యార్థులకు ఇదే ఆఖరి ఛాన్స్ అని అధికారులు స్పష్టం చేశారు.
విద్యార్థులు తమ పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ లేదా ఇతర వివరాలలో ఏవైనా తప్పులు ఉంటే, వాటిని సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల లాగిన్ ఐడీల ద్వారా ఈనెల 10వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో సరిచేసుకోవచ్చు. ఈ గడువును ఎంతమాత్రం పొడిగించే ప్రసక్తం లేదని బోర్డు తేల్చి చెప్పింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తప్పుల్లేని ఒరిజినల్ టెన్త్ సర్టిఫికెట్లను విద్యార్థులు పొందే వీలుంటుంది.
