జులైలోనే టెన్త్ ఎగ్జామ్స్…

  • Publish Date - May 11, 2020 / 04:13 PM IST

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. జులైలోనే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు. త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. 

పరీక్షల కేంద్రాల వద్ద భౌతికదూరం పాటిస్తూ..విద్యార్థులు మాస్కులు ధరించి పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే షెడ్యూల్ తప్పు అన్నారు. పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా ఊహాజనితమని, వాటిని ఖండిస్తున్నామన్నారు. త్వరలో పరీక్షల షెడ్యూల్ ను ప్రకటిస్తామని చెప్పారు. 

ఆగస్టు కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభిచేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. సెప్టెంబర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్లాసులు ఉంటాయని వెల్లడించారు. యూసీజీ గైడ్ లైన్స్ ప్రకారం విద్యా సంవత్సరం రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. 

లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిందని తెలిపారు. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్లు వాడాలని ప్రొటో కాల్స్ ఉన్న నేపథ్యంలో అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అన్ని సెంటర్ల వద్ద వాటిని పెంచుకుంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుని టెన్త్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు.