Students wade through mud to build a road to their village
Andhra Pradesh; తమ గ్రామానికి రోడ్లు వేయాలంటూ విద్యార్థుకు తమ గోడును ప్రభుత్వానికి వెళ్లబోసుకుకున్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం, చాపాడు మండలపరిధిలోని ఎన్. ఓబాయపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న తిప్పిరెడ్డిపల్లె గ్రామానికి(Andhra Pradesh) రోడ్డు పరిస్థితి అద్వానంగా తయారయ్యింది. దాంతో ఓరికి రాకపోకలు కొన్సాసాగించటం కష్టంగా మారింది. గుంతలు పడిన రోడ్డులో ప్రయాణం చేయడానికి అక్కడి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.
Crude oil: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం?
ఇప్పటికే పలుమార్లు అధికారులకు తమ కష్టం గురించి చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. దాంతో, ఆ ఊరి పిల్లలు తమ గోడును ప్రభుత్వానికి అర్థమయ్యేలా తెలియజేసే ప్రయాతం చేశారు. ఆ ఊరి విద్యార్థులు బురద రోడ్డులో మోకాళ్లపై నిల్చొని తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ గ్రామానికి రోడ్ వేయాలంటూ విద్యార్థులు అధికారులను కోరుకున్నారు.
ఇప్పటికే చాలాసార్లు అధికారులకు విన్నవించుకున్నాం అని, అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో సమస్యను పరిష్కరించండి అంటూ విద్యార్థులు మోకాళ్లపై కూర్చొని దండం పెడుతూ వేడుకున్నారు. వారితోపాటు ఊరు మహిళలు కూడా ఆ బురదలో దిగి తమ నిరసన తెలియజేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విన్నపంపై అధికారులు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.