Supreme court: చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. సీజేఐ ఏం చెప్పారంటే..

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పిటీషన్ మంగళవారం ప్రస్తావనకు రానున్నట్లు తెలిపింది.

Supreme Court – Chandrababu: స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case) లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) క్వాష్ పిటీషన్‌ (Quash Petition) పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పిటీషన్ మంగళవారం ప్రస్తావనకు రానున్నట్లు తెలిపింది. క్వాష్ పిటిషన్‌పై రేపు ప్రస్తావించడానికి సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం అనుమతిచ్చింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తన అరెస్టు చెల్లదంటూ, సీఐడీ ఎఫ్ఐఆర్‌ను రద్దుకు చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా మెన్షన్ చేశారు.

Read Also: Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుకు నిసనగా ఐటీ ఉద్యోగులు కార్ల ర్యాలీ, ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో భారీగా పోలీసులు మోహరింపు

ఇది ఏపీ వ్యవహారం.. ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారని సుప్రీంకోర్టుకు లూథ్రా తెలిపారు. అయితే, సీజేఐ స్పందిస్తూ చంద్రబాబు ఎన్నిరోజుల నుంచి కస్టడీలో ఉన్నారని అడుగగా.. ఈనెల 8న అరెస్టు చేశారని లూథ్రా తెలిపారు. రేపు (మంగళవారం) మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని న్యాయవాదులకు సీజేఐ సూచించారు. రేపటి మెన్షన్ లిస్టులో పూర్తిగా వింటామని సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఇదిలాఉంటే ఇప్పటికే చంద్రబాబు క్వాష్ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. దర్యాప్తు తుదిదశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమంటూ గత శుక్రవారం క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Read Also: Chandrababu Interrogation : సీఐడీ అధికారులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? చంద్రబాబుని అడిగిన ఏసీబీ కోర్టు జడ్జి

చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చంద్రబాబు క్వాష్ పిటీషన్‌ను సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్నారని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని లూథ్రా సుప్రీంకోర్టును కోరారు. రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని సీజేఐ సూచించారు. ఇదిలాఉంటే ఏపీ ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదించిన ముకుల్ రోహత్గీ, సీఐడీ తరపున వాదించిన రంజిత్ కుమార్ లు కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు